శ్రీమద్రామాయణము బాలకాండము : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
వృషనహీనములైన మేషములకు 
పితృదేవతలు ఫలముల నిచ్చిరి
గౌతమ ముని తపః ప్రభావముచే 
ఇంద్రుడు మేషవృషనుడాయెను 

రామా అహల్య శాప విమోచనమునకు
ఇప్పుడు సమయమాసన్నమైనది
ఆ ఆశ్రమమునకు మీరు ప్రవేశించాలి 
రామలక్ష్మణులు ఆశ్రమము చేరినారు 

వాయుభక్షణాది దీక్షలో యున్న
అహల్యకు రాముని పాదము శోకగ
అహల్యదివ్య తేజస్సుగా వెలుగుతూ 
శ్రీరామునికి అంజలి ఘటించినది 

పిదప వారందరినీ ఆశ్రమంలోకి పిలిచి 
అతిథి సత్కారములను నెరిపెను
గంధర్వులు గానమునర్చగా 
అప్సరసలు నాట్యము చేసిరట 

దేవతలంతా పూల వాన కురిపించినారు 
రాముడొచ్చిన విషయము గౌతముడుగని 
వారి చెంతకు వచ్చి నిలిచినాడు 
పవిత్రురాలైన హాలియ పతిని చేరింది


కామెంట్‌లు
Popular posts