2018 మే నెల 19వ తేదీ ఉదయం 8 గంటలకు Washington DC సమీపంలోని Tyson Corner నుంచి Pitsburg శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి బయలుదేరి వెళ్ళాము. మొత్తం అటవీ ప్రాంతంలా ఉంది. కొండలు, లోయలు, దట్టమైన చెట్లతో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంది. తిరుమల తిరుపతి, ఊటీ లా ఉంది. మేఘాల్లో ప్రయాణం. లోయ ప్రాంతంలో మేఘాల స్పష్టంగా కనబడ్డాయి. ప్రతి పది నిముషాలకూ భారీ వర్షం పడుతూ, తగ్గుతూ, పెరుగుతూ, అంతలోనే ఎండ పడుతూ - వాతావరణం చిత్ర విచిత్రంగా ఉంది. ఒక్కోసారి భారీ వర్షం కారు ఊగిపోయేంతగా పడింది. రెండు గంటలు గడిచాక వర్షం కాస్త తగ్గినప్పుడు Sheetz పెట్రోల్ బంకు దగ్గర కాసేపు ఆగి వేడి వేడిగా కాఫీ త్రాగాము. అక్కడక్కడా రోడ్డు పక్కన కొన్ని భూములు పంటల కోసం దున్ని సాగుకు సిద్ధం చేసినట్లు ఉన్నాయి. కొన్ని చోట్ల ట్రాక్టర్ తో దున్నడం కూడా కనబడింది. కొన్ని పొలాల మధ్యలో Farm Houses ఉన్నాయి. కొంత దూరం కొండల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు దట్టమైన మంచు ఆవరించి, ముందు వెళ్తున్న వాహనాలు కానీ, రహదారి కానీ అసలు కనబడలేదు. కనుచూపు మేర పూర్తిగా తెల్లని మంచు మాత్రమే కనబడింది (వీడియో పెట్టాను చూడండి). ఎత్తు, పల్లాల రహదారిపైన ప్రయాణం చాలా adventures గా సాగింది. మొత్తం మీద శ్రీశైలం, తిరుపతి ఘాట్ రోడ్ల మీద ప్రయాణం చేస్తున్న అనుభూతి కలిగింది. దేవాలయం చాలా ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంది.
చుట్టూ చెట్లు, కొండల నడుమ ఈ గుడి నిర్మించారు. ఎన్ని వాహనాలు వచ్చినా చుట్టూ పార్కింగు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. గుడికి వెళ్లే దారిలో శ్రీ వెంకటేశ్వర స్వామితో సహా వివిధ దేవతామూర్తుల ఫోటో Frames ఒక van పైన పెట్టుకుని ఒక అమెరికన్ విక్రయిస్తున్నారు. కాస్త ముందుకు వెళ్తే ఎదురుగా పెద్ద రాజగోపురం కనబడింది.
అక్కడ మెట్ల దగ్గర ఫోటోలు తీసుకున్నాము. చలి కోట్లు, పాదరక్షలు పెట్టుకోడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే కాళ్ళు కడుగుకోడానికీ, తడి కాళ్ళు ఆరబెట్టుకోడానికీ కూడా ప్రత్యేకమైన సౌకర్యం కల్పించారు. స్వామి దర్శనానికి వెళ్లే దారిలో దేవాలయ నిర్మాణ చరిత్రను తెలియజేసే ఫోటోలను గోడలపై ఉంచారు. అక్కడ నుండి Photography / వీడియోగ్రఫీ prohibited అనే బోర్డు కూడా ఉంది.
కింది అంతస్థులో వినాయకుని దర్శనం చేసుకుని పైకి వెళ్ళగానే ధ్వజస్థంభం కనబడింది. పెద్ద మండపం మధ్యలో శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహాలను వరుసగా వేర్వేరు గుళ్ళలో ప్రతిష్టించారు. చుట్టూ ప్రదక్షణం చేయడానికి వీలుగా ఉంది. ఒక పక్కన ఊయలలో స్వామివారి పటం పెట్టారు. మధ్యలో కళ్యాణ వేంకటేశ్వరుని ఉత్సవమూర్తులను ఉంచారు. మరో వైపు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోడానికి వీలుగా ఒక చిన్న మండపం పెట్టారు. దర్శనానికి వచ్చిన భక్తులను బృందాలుగా లోపలికి అనుమతించి, గోత్రనామాలతో అర్చన, హారతి తర్వాత తీర్థం ఇచ్చి, శఠగోపం పెట్టి, అనంతరం లోపలికి పంపుతున్నారు. దర్శనం కాగానే వేడి వేడిగా చక్రపొంగలి ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం తీసుకుని కాసేపు మండపంలో కూర్చుని స్వామివారిని ధ్యానం చేసుకుని క్రిందకు వచ్చాము.
అక్కడ పెద్ద ఫలహారశాల ఉంది. 19-05-2018 శనివారం :Devotees Appreciation Day" సందర్భంగా భక్తులందరికీ మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ఉచితంగా ప్రసాదం (LUNCH) అందజేస్తున్నట్లు అక్కడ కౌంటర్ దగ్గర notice పెట్టారు. అక్కడ ఎంతోమంది భక్తులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. గుంటల పళ్లెంలో వేడివేడిగా సాంబారు అన్నం, పులిహార, రవ్వకేసరి, దద్దోజనం పెట్టి అందజేశారు. ప్రసాదం ఆరగించి తృప్తిగా బయటకు వచ్చాము. ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రసాదాలు కావాలంటే ఒక్కొక్కటీ రెండు డాలర్ల చొప్పున విక్రయిస్తున్నారు.
దేవాలయంలో చాలా మంది భారతీయులు ముఖ్యంగా తెలుగువారు కన్పించారు. చాలామంది చిరునవ్వులు చిందించారు. కొంతమంది wish చేశారు. ఒకరిద్దరు పలకరించి, పరిచయం చేసుకున్నారు. చుట్టూ వాతావరణాన్ని ఆస్వాదించి, ఫోటోలు తీసుకుని, మధ్యాహ్నం రెండున్నరకు బయలుదేరి, నయాగరా దారి పట్టాము.
మళ్ళీ అదే పరిస్థితి, కాసేపు వర్షం, కాసేపు ఎండ. ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. మధ్యలో ఒక పొడవైన సొరంగ మార్గం కూడా వచ్చింది. బహుశా కొండను త్రవ్వి నిర్మించినట్లు అనిపించింది. మార్గంలో చిన్న చిన్న ఊర్లు, అక్కడక్కడా కొన్ని జంతువులు - జింకలు, గుర్రాలు, నల్ల ఆవులు, గొర్రెలు మొదలైనవి కనబడ్డాయి. Edinbaro University of Phencilveniya బోర్డు కనబడింది. ఆ తర్వాత పెద్ద నది ఒడ్డున ఉన్న రోడ్డు మీద చాలా సేపు ప్రయాణించాము. Beach Resorts, Boating Clubs, పంట పొలాలు, ద్రాక్ష తోటలను దాటుకుంటూ ముందుకు సాగాము. ఒక చోట రైల్వే క్రాసింగ్ వద్ద ఆగాము. రెండు ఇంజన్లు, 79 పెట్టెలతో ఒక గూడ్సు బండి వెళ్ళింది.
సాయంత్రం ఆరు గంటలకు కాఫీ కోసం వెతుక్కుంటూ Fredonia State University of New York లోపలికి వెళ్ళాము. చాలా పెద్ద campus ఉంది. అప్పుడే convocation అయినట్లు ఉంది. విద్యార్థులు నల్ల గౌన్లు, టోపీలు పెట్టుకుని బయటకు వస్తున్నారు. అక్కడ gardens లో తిరుగుతూ తల్లిదండ్రులతో, స్నేహితులతో ఫోటోలు తీసుకుంటూ సందడిగా ఉన్నారు. మేము కూడా కారు దిగి పరిసరాలను పరికిస్తూ, ఫోటోలు తీసుకున్నాము. ఇంతకీ అక్కడ కాఫీ దొరక్కపోవడంతో మరి కాస్త దూరం వెళ్లి, ఒక TRAVEL PLAZA దగ్గర ఆగి కాఫీ త్రాగి, ముందుకు సాగాము.
నయాగరా సమీపంలో మేము ముందుగా రిజర్వ్ చేసుకున్న Scottish Inn Motel దగ్గరకు రాత్రి 8 గంటలకు చేరుకున్నాము. Hotel యజమాని దంపతులు మాకు స్వాగతం పలికి Rooms Keys తో పాటు Welcome Basket ఇచ్చారు. అందులో అరటిపళ్ళు, ఆపిల్స్, బిస్కెట్లు, Cup Cakes, Fruit Juice Packets మొదలైనవి ఉన్నాయి. రూమ్స్ లో దిగి, ఫ్రెష్ అయ్యి, డిన్నర్ చేసి, రాత్రి దీపాల వెలుగుల్లో నయాగరా జలపాతాల అందాలు తనివితీరా చూశాము. మళ్ళీ మర్నాడు 20-05-2018 ఆదివారం పగటి పూట అందాలను కూడా వీక్షించాము. నయాగరా జలపాతం సందర్శన వివరాలు Next Posts లో తెలియజేస్తాను.
🌸🌷🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి