తిరుపతిలో కవి సోమన్న "చిరునవ్వు" పుస్తకావిష్కరణ

 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న పుస్తకం "చిరునవ్వు" పుస్తకావిష్కరణ ప్రెస్ క్లబ్,తిరుపతిలో ఘనంగా జరిగింది.పాత్రికేయ మిత్రుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథి, జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు  అరవ జైపాల్, డా. శివకుమార్,మరియు విచ్చేసిన పుర ప్రముఖుల చేతుల మీదగా ఆవిష్కరించారు.అనంతరం ఈ పుస్తకాన్ని గుండ్లూరు సుబ్రమణ్యం గారికి అంకితమిచ్చారు.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు.ఈ కార్యక్రమంలోఆత్మీయ అతిథులు రెడ్డి కుమార్, పోతాని సుధాకర్, ఆవుల రవీంద్ర, సువర్ణ ఆనంద, మేజర్ నాగరాజు,సాహితీవేత్తలు అర్. సి. కృష్ణస్వామి రాజు,కళాకారులు, శ్రేయోభిలాషులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts