పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు, సమన్వయకర్తగా ఎంపికయ్యారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు కళారత్న డా.కత్తిమండ ప్రతాప్ కుమార్ నిర్దేశాలతో రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు సమన్వయకర్తగా ఎంపిక చేసి, నియమించినట్లు తిరుమలరావుకు సమాచారమిస్తూ ఆహ్వానపత్రం అందింది. ఈ మేరకు వచ్చే నెల ఆరవ, ఏడవ తేదీల్లో జరుగనున్న ఏడవ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షులు జి.ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రణాళికా అధికారి టి.పార్ధసారథిలు తిరుమలరావును కో ఆర్డినేటర్ గా ఎంపిక చేస్తూ నియామకపత్రంలో ధృవపర్చారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొంది, ఇప్పటికి 166 సాహితీ సదస్సులతో ముప్పై ఎనిమిది ప్రపంచ రికార్డులను సాధించిన చరిత్ర శ్రీ శ్రీ కళా వేదిక సొంతం. ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షులు జి.ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రణాళికా అధికారి టి.పార్థసారథి, డా.డబ్బీరు గోవిందరావు, భోగెల ఉమామహేశ్వరరావు, వాడాడ శ్రీనివాసరావు మ తదితరులకు తిరుమలరావు, ఇద్ది పాపయ్య, మణిపాత్రుని నాగేశ్వరరావు తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమలరావుకు లభించిన ఈ గౌరవం పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, కొత్తూరు రచయితల వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
ప్రపంచ మహాసభల సమన్వయకర్తగా తిరుమలరావు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి