మనుజుడవైపుట్టి
మా ఇంటి డోలలో
బాలరూపుడవైన
గోపాల బాలుడా!
లాల పోసి నీకు జోల పాడెదనయ్యపరమేశ్వర నీవు
కిలకిల నవ్వక పువ్వుల పాన్పు పై పవళించరా కన్నా.
కలువ పువ్వుల వంటి కన్నులు ముకుళింప కాసేపు బజ్జోరా బుజ్జి నా తండ్రి.
తాతయ్య గారికి
మడి గుడ్డఇవ్వాలి
నానమ్మ గారికి
పూజా విధిచూడాలి. నీ తండ్రిగారికి అన్న
సమకూర్చిపెట్టాలి
మారాము చేయనీ
మంచి బుజ్జోడా! బూచోడు వస్తాడు బుట్టేత్తుకోనీ. జో జో.
అలమందలు కాచి
అలిసిపోయినచిన్న
బాలగోపాలుడా
మన్నుతిన్నావని
అమ్మ కొట్టినవేళ
వేలితో నీ నోట
ఇలను చూపెట్టావు
వెన్నను దొంగిలి
అమ్మ నేనెరుగను
అంటూ కొంగెట్టుక
తిరిగే అల్లరి దొంగ లాలి,లాలి
లీలలు నీకన్నా
ఏవరికిఎరుకయ్య
అలుకమాని ఇంక
బజ్జోర బుజ్జోడా లాలి లాలి.
చక్కికి కట్టిన చిలుకలు నిను చూచి రామా రామా అనుచు పలికేను చోద్యమే.
జోల పాటంటేను పాపలపై వెన్నెల
కురిసినట్టుండాలి
శిశువుల చెవులకు
శృతిలయలతో
చేరి, చిరునవ్వుతో శిశువు కనుమూసి
నిదురకు జారుకోవాలి.
జోల పాటలోన
కృష్ణుని లీలలు,
రాముమహిమలు
తల్లి మనసులోన తపనలుపలకాలి.
నీతులు, సూక్తులు
సుధా మధురోక్తులు,శిశువులు తలలూపే
చిన్ని చిన్ని దరువులు ఇట్టి వాటిని గూర్చి చిట్టి పదముల తోడ జోల పాట
పాడ ఉయ్యాలలో బిడ్డ గుర్రెట్టి
నిద్రించు.
భద్రాద్రి రామయ్య నా కట్టివరమివ్వు. \
సురుచిరమైనట్టి పదసంపద గూర్చి పాపలకు రాసెద
జోల పాటలునేను జగమంతమెచ్చేగా. పాపాయి వెచ్చగా నిదురించ పాడెద.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి