డా.కె.జానకిగారిRoleof women infreedom struggle in Andhra Pradesh
భారతీదేవి రంగా1908లోమాచవరంలో పుట్టారు.ప్రొ.ఎన్.జి.రంగాతో పెళ్లయినాక నిడుబ్రోలు నివాసి ఐన ఆమె శారదానికేతన్ లో చదివి ఇంగ్లాండ్ లో ఆక్స్ఫర్డ్ లోని రస్కిన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో 1925_26లోచదువుతుండగా డా.ఎస్.రాధాకృష్ణన్ స్పీచ్ విని దేశ సేవ చేయాలనే నిర్ణయానికొచ్చారు.భారత్ తిరిగి వచ్చాక గాంధీజీ నిడుబ్రోలు వచ్చినపుడు భారతి తను స్వయంగా చేసిన ఖాదీ సంచీలో తన బంగారు గాజులు వేసి ఆయనకిచ్చారు.ఆరోజుల్లో భర్త మద్రాస్ పచ్చియప్పకాలేజీలో పనిచేస్తూ,ఉద్యోగం వదిలివేయటం చేరారు.ఆటైంలో భారతి తెనాలిలోశిబిరాలు పెట్టి 6నెలలు పికెటింగ్ ,నూలు వడకటంలో శిక్షణ ఇచ్చింది.నూతన వధువులు కూడా రోజూ 6గంటలు మద్యం షాపులు,విదేశీవస్త్రాల అమ్మకం ని అడ్డుకునేవారు. గుంటూరు కృష్ణ గోదావరిజిల్లాల్లో భారతి విశేష కృషిచేశారు.500రూ.ఫైన్ వెల్లూరు జైలుశిక్ష పడింది.హరిజనోద్ధరణ, కులాంతర వివాహం సహపంక్తి భోజనాలతో చైతన్యం తెచ్చింది.రైతు కుటుంబానికి చెందిన భారతి రైతుల కోసం వేసవి బడిని 22ఏళ్లు నడిపి ఆస్త్రీల పిల్లల బాగుకై కృషిచేసింది. వారికి శిక్షణ శిబిరాలు నడిపింది.వెంకట గిరి జమీందారీ,ఆంగ్లేయుల జులుంలో ఆమె గాయపడింది.1940లో ఆంధ్ర కిసాన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, విరాళాలు వసూలుచేసి మందసరైతులపోరాటానికి అండగా నిలబడి జమీందార్లకు చుక్కలు చూపింది.1940_41లో ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ తో ఏజెన్సీ ప్రాంతాన్ని ఆదుకుంది. 1956లో ఘంటసాల లో ఆంధ్ర ఉమెన్స్ కాన్ఫరెన్స్ కి అధ్యక్షత వహించి స్త్రీల హక్కులకై ప్రేరణ కలిగించింది తన ఉపన్యాసాలతో!1952_53లో రాయలసీమ కరువులో దుస్తులు,పశులమేత ధాన్య సేకరణ లో అమోఘమైన పాత్ర పోషించింది.ఆమెను అన్నపూర్ణ గా కొలిచి మొక్కారందరూ!1958లో ఆంధ్ర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎన్నికైంది. భారత దేశ మంతా పర్యటించి బాలికా విద్యావ్యాప్తి చేసి నిడుబ్రోలు లో 1931లోనే బాలికా పాఠశాల ప్రారంభించింది. ఇప్పుడు చేబ్రోలు లో ఆమెపేర లైబ్రరీ నడుస్తోంది.ఆమె భర్త తో సహా ఎంతోమంది ఆమెను కీర్తిస్తూ పాటలు పుస్తకాలు రాశారు.27సెప్టెంబర్ 1972లో గుండెజబ్బుతో అమరులైన భారతికి దేశం ఘన నివాళి అర్పించింది🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి