దశరథ మహారాజా రేపు ప్రభాతవేల
నేను చేసే యజ్ఞము ముగుస్తుంది
మహార్షలు సమ్మతించిన విధముగా
సీతారాముల వివాహము జరిపిద్దాము
దశరథుడు జనకుని మాటలు విని
ధర్మాత్ముడైన ఓ జనక రాజ
దానము స్వీకరించుట దాత నిర్ణయం
కావున మీ ఆజ్ఞనుసారమే జరుగును
దశరథుని వినయ పలుకులను విని
జనకుడుఎంతో సంతోషించినాడు
మునులందరూ అచటికి వేతెంచినారు
సంతోషంతో ఆ రాత్రి అచట గడిపినారు
శ్రీరాముడు లక్ష్మణునితో కూడి
విశ్వామిత్రుని వెంట తండ్రి వద్దకెళ్ళినాడు
ఇరువురు తండ్రి పాదాలకు నమస్కరించి
దశరథ రాజు ఆశీస్సులను పొందినారు
దశరథుడు పుత్రులను చూసి మురిసినాడు
ఆ రాత్రి వారు జనుకుని చెంత గడిపినారు
ధర్మ రహస్యముల నెరిగిన జనకుడు
యజ్ఞ కార్యములను ముగించుకున్నాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి