ఉన్నూరు పిలగా
ఊరకనె తిరగకుర ఊరంతా
వృధాగ పోతుంది సమయమూ
బతుకంతా......భారమూ
"
ఓరోరి "
సర్కారు బడి నీ చెంతనే ఉన్నది
చదువు కోడానికి రమ్మంటున్నది
ఉచితంగనే నీకు చదువుందిరా
ఊరొదిలి నీవు వెళ్ళొద్దురా
"ఓరోరి "
పుస్తకాలిస్తరు,నోటుబుక్లస్తారు
డిజిటల్ పాఠాలు బోధిస్తరూ
ఆటల పీర్యడ్లొ ఆడిస్తరు
మధ్యాన్న భోజనం పెట్టిస్తరూ
ఊరొదిలి నీవు వెళ్ళొద్దురా
"ఓరోరి "
ఫీజుల మోతలు మోగిస్తరు
బట్టీల చదువులు చదివిస్తరు
చదివెటోడిని అందరికి చూపిస్తరు
చదవని వాళ్ళని వదిలేస్తరు
ప్రైవేటు బడి మోజు నీకొద్దురా
ఊరొదిలి నీవు వెళ్ళొద్దురా
"ఓరోరి,"
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి