శంకుపూల శకుంతల: -డా. కందేపి రాణీప్రసాద్
 

హలో పిల్లలూ! మా ఇంటి కుండీలలో శంకు పూలు విపరీతంగా పూయడం వలన అన్నీ బొమ్మలలోనూ వాడేశాను. ఊదారంగు, తెలుపు రంగు శంకు పూలున్నాయి. వీటినుప యోగించి అమ్మాయిని సృష్టాంను. ఈ శంకులతో పాటుగా, వడియాలను కూడా వాడుకున్నాను. చక్రాల వడియాలు, ఉల్లిపాయ రంగులు వంటి వడియాలు ఉపయోగించాను. శంకు పూల చెట్టు ‘‘ఫాసి’’ కుటుంబానికి చెందిన మొక్క. ఇది తీగ జాతి మొక్క. ఒక్కసారి పెట్టామంటే ఇల్లంతా ఆక్రమించేస్తుంది. దీనిని సంస్కృతంలో 'గిరికర్ణిక' 'శంఖ పుష్పం' అనీ అంటారు. దీని శాస్త్రీయ నామం "క్లిటోరియాటర్నేటియా" (cliloria ternalia). ఇవి ఆసియా ఖండానికి చెందిన మొక్కలు. శ్రీలంక వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా మమ్మల్ని గుర్తు పట్టి పలకరించాయి. వీటి ఆకులు, తీగల్ని, కాయలు కూడా బొమ్మలలో విపరీతంగా వాడుకున్నాను. తమిళ, తెలుగు, మలయాళం భాషలలో దీని పేరు 'శంఖం' నుండే ఉద్భవించింది. దీని పేరులోని టెర్నేటియా అనే పేరు ఇండోనేషియా దేశంలోని ‘టెర్నేట్’ అనే ప్రాంతం నుండి వచ్చింది. ఈ పువ్వులను జాషధాలలో చికిత్సకు వాడతారు. అలాగే సహజ రంగులలో పువ్వులను వాడతారు. భూసారాన్ని పెంచడానికి కూడా ఈ చెట్లను పెంచుతారు.
 ఉల్లిపాయ రింగులతో రింగురింగుల జుట్టును పెట్టాను. చింతగింజల కళ్ళు, ఎర్ర వడియపు నోరు పెట్టాను. చక్రాల వడియాలతో చేతులు, కాళ్ళు తయారు చేశాను. శంకు పూల పావడాను అందంగా కుట్టాను. చక్రాల వడియాల జాకెట్‌ను కుట్టాను. పావడా మీద చక్ర వడియాల డిజైన్‌ను అందంగా అమర్చాను. ఊదా, తెలుపు రంగుల శంకుల్ని పావడా మీద కుట్టాను. చూశారా మా పాప ఎంత అందంగా ఉందో?.
కామెంట్‌లు
Popular posts