సీతాదేవిని వివాహమాడ గోరివచ్చిన రాజకుమారుల తీరుతెన్నులను వివరించుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
శివుని మాటలు విన్న దేవతలంతా 
దుఖిఃతులై ఆ శివుని వేడుకుంటారు 
వారి మొరను విని పరమశివుడు 
ధనస్సును వారికి కానుకగా ఇచ్చాడు 
దేవతలు దేవరతునకు ధనస్సునిచ్చారు 

ఒకప్పుడు నేను యాగము చేయదలచి 
భూమిని దున్నుచుండగా 
నాగటిచాలు నుండి ఒక కన్య వేలువడెను 
ఆమెకు సీత అని పేరు పెట్టినాను 

ఇప్పుడు నాకుమార్తె పెరిగి పెద్దదైనది 
సీతను మనువాడుటకు ఎందరో వచ్చారు 
ధనస్సు నెక్కుపెట్టిన వారికి సీతనిస్తాను 
ఓ మునివర నా మాటలు వినుము

ధనస్సునెత్తలేక ఎందరో మిథిలను ముట్టడించారు 
మిథిలావాసులను ఎన్నో విధాల హింసించారు 
నా రాజ్యదుర్గము దెబ్బతిన్నది 
అందుకు నేను ఎంతో చింతించితిని 

ఓ మునీశ్వర మిక్కిలి ప్రభావముగల 
శివధనస్సు రామలక్ష్మణులకు చూపెద 
శ్రీరాముడు శివధనస్సు నెక్కి పెట్టినచో 
సీతాదేవిని రామునికి సమర్పింపగలను


కామెంట్‌లు
Popular posts