సుప్రభాత కవిత : - బృంద


పరితపించి బ్రతుకున 
పెనుమార్పును కోరి 
పలవరించు ఆశలకు 
పదును పెట్టాలని....

అహంకారపు ఆరళ్లను 
మమకారపు ముచ్చటలో 
మరపింంప చేసి జీవితం 
మధురంగా మార్చాలని...

కోత కోయు మాటలను 
కోపంగా  తీసుకోక 
కోరిన తీరం చేరి 
చేతలతో బదులిమ్మని....

పరంపరగా మారిన 
పరితాపపు ఆనవాళ్లు 
చివరంటా తొలగించి 
చింతలకు సెలవిచ్చేలా...

అడుగేయలేని అలసటలో 
ఆసరాగా చేయందించి 
అన్నీ తానై నడిపించే 
ఆత్మ బంధువు అవ్వాలని 

పరంజ్యోతి రూపంలో 
ప్రభలు వెదజల్లుతూ 
ప్రతి మనసుకు తరగని 
ప్రమోదం తెచ్చే ప్రభాకరునికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు
Popular posts