సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -257; ఆలి వొంకోళ్ళు ఆత్మ బంధువులు, తల్లి వొంకోళ్ళు తగినోళ్ళు-నాయిన వొంకోళ్ళేమో దాయాదులు
****
"అవ్వా! నూవెన్నన్న శెప్పు బందుత్తాలు పతింట్లె గిట్లనే ఉన్నయ్! ఉన్న మాటంటే ఉల్కెక్వగని అవునా కాదా నువ్వే శెప్పవ్వా! ''
 గిప్పుడు బందుత్తాలతో నీకొచ్చిన శెరేంది తమ్మీ? మీ యాఁవె ఏవన్న శరానికొచ్చిందా?మీ యమ్మేమన్న అన్నదా? ఇంట్లేమన్న లొల్లి జర్గిందా ఏంది? బందుత్తాల ముచ్చెటి ముందలేస్కున్నవ్?"
 "అవ్వా నీకేమన్న అంజనమేసుడు ఎర్కనా ఏంది? గిట్ల అన్ననో లేదో గప్పుడే శెప్పినవ్?"
 "గిందులో అంజనమేసుడేముంది తమ్మీ? గా ముచ్చెటి ఇంట్లె వొచ్చిందంటే పొగ రాజుకున్నట్టే. అవ్వో ఆలో శిన్నగ ఎల్లదీత్తది. ఇంకేముంది" కల్గెర కయ్యం దింపర గంప" అన్నట్టు ఇంట్లోళ్ళు తలో మాట అందుకుంటరు. ఎవలింట్లైనా గిదే వుంటది తమ్మీ!"
 "అవునవ్వా! గియ్యాల మీ మర్దలు "ఆలి వొంకోళ్ళు ఆలివొంకోళ్ళే" శానా మంచోళ్ళు. అల్లుడు బాగ్గోర్తరు. ఆత్మలో ఉన్నది కన్పెట్టి కట్టం గాకుండ మస్లుకుంటరు "అంది. గా మాట యినంగనే..."
 మాయమ్మ అందుకొని గాల్లేనేంది నా తర్పోళ్ళు మంచోళ్ళు గారా? శిన్నతనం నుంచి నా తల్లిగారోళ్ళు గాన్ని మన్వడు, మేనల్లుడని గంతగనం ముద్దు జేసి పెంచిర్రో నీకేం తెల్సు. ఏదన్న కట్టమొచ్చిందంటే మా అమ్మోళ్ళు అల్లల్లాడి పోతరు. గిప్పటికీ గా పేమ తగ్గలే. గాళ్ళంత తగినోళ్ళు యేడన్న ఉంటరా " అనంగనే నీ మర్దలు మూతి మూడొంకలు తిప్పింది."
 "గట్లనే ఉంటయి తమ్మీ! ఇంట్లె పంచాతులు.గా దానికే నువ్వు గింతిదైతె ఎట్ల శెప్పు."
 "అవ్వా! గంతట్తో ఆగితే మాగనె వుండు. గక్కడే మంచాల కూసోని సుట్ట కాల్సుకుంటున్న మా నాయిన గయ్యిన  "మీ వోళ్ళంత మంచోళ్ళు ఇంగ నా వోళ్ళేనా పరాయోళ్ళు" అని అమ్మ మీద ఒంటి కాల్తో లేశిండు."
" అమ్మని ఆగమంటే ఆగుద్దా "అవునయ్యా మీ వోళ్ళు ఎట్దైన పరాయోళ్ళే. పాలోళ్ళు ఏడ ఓరుత్తుర్రు. మన గెట్టుకాడ పంచాతి అప్పుడే మర్శినావ్ గాళ్ళంత దుష్మన్లు గీ పెపంచకంల లేరు." అంది. నాయిన అల్గిండు. అమ్మ కోపంగ తినకుండ కూసుంది. ఎవలికి ఆళ్ళు బిగుసుకుపోయిర్రు. ఏం జెయ్యాల్నో కాల్జేతులు ఆడక నీ తానికి వొచ్చినవ్వా!"
ఒరే తమ్మీ! లోకంల అందర్కి తెల్శిందేనాయె.మీఅయ్యకి గంత రోషమేందిరా? కక్కయ్య బాగ కాకమీదున్నడులే!"
"నేనొత్త పా!"
 "ఏందే కక్కయ్యా! " మాటకి మాట తెగులు నీటికి నాసు తెగులని" శిన్నగ అన్కున్న మాటల్కి గంత శెరానికి బోవాల్నా? నువ్వే గా సామెత నా శిన్నప్పుడు జెప్పినవ్! అప్పుడే మర్శినవా?"
 " ఏంది బిడ్డా! " ఉరుముర్మి మంగలం మీన వడ్డట్టు"  గిట్ల వొత్తున్నవో లేదో నన్ననబట్టినవ్?"
 "  లేకపోతే ఏందే  కక్కయ్యా గీ సామెత ఎన్కటి నుంచి వుంది."ఆలి వొంకోళ్ళు ఆత్మ బందుగులు, తల్లి వొంకోళ్ళు తగినోళ్ళు-నాయిన వొంకోళ్ళేమో దాయాదులు" అని యిన్లేదా? శెప్పలేదా నువ్వు?"
 "అవును బిడ్డా! యాది మర్శిన.ఎందుకోగని మా వోళ్ళని అనేతల్కి రోషమొచ్చింది."
 అందరట్ల ఉండర్లే కక్కయ్యా! బారతం ఇన్నోళ్ళు వొంట బట్టిచ్చుకుర్రు. రామాయిణం తెల్శినోళ్ళు సీతమ్మని బూమాత గుండెల్ల బెట్టి దాస్కుందని గట్లన్నరు.గట్లనే బిడ్డనిచ్చినప్పుడు అల్లుడి బాగ్గోర్తరని గట్లన్నరు."
"గంతేగని గిందులో శెరానికి బోవాల్నా! తిండి మీద అలగాల్నా శెప్పుండ్రి.ఏం శిన్నమ్మా నిన్ను సుత అడ్గుతున్న."
 "గట్ల జెప్పవ్వా! గిప్పుడు అందరి మొకాలు తేజుగైనయి. గీ లొల్లి ఎన్ని దినాలుంటదో నని మస్తు బయమేశిందవ్వా!"
గదండీ సంగతీ! "ఆలి వొంకోళ్ళు ఆత్మ బందుగులు తల్లి వొంకోళ్ళు తగినోళ్ళు-నాయిన వొంకోళ్ళేమో దాయాదులు" అంటే గిదే మరి.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం