56వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
చిత్రకూటమున లక్ష్మణుడు కుటీరములను నిర్మించుట 




"శత్రుధమనుడవైన ఓ లక్ష్మణా!
వనములోని చిలుకలు, కోకిలలు గోరువంకలు
చేయు మధురస్వరములను వినుము 
ప్రయాణమునకు ఇది తగిన సమయము 

అన్న హెచ్చరికతో లక్ష్మణుడు నిద్రలేచి 
ప్రయాణపు బడలికను తీర్చుకొనెను 
వారు పవిత్ర జలములో స్నానము చేసి 
చిత్రకూటమునకు బయలుదేరినారు 

ఓ లక్ష్మణా! మిక్కిలి ఎత్తైన శిఖరములతో
ఈ చిత్రకూటపర్వతమును చూడుము 
నాయనా! సౌమిత్రా !ఈ పర్వతము
సమతుల్యమైన స్థలముతో యున్నది 

వివిధ వృక్షములతో రమ్యంగా యున్నది 
ఇచ్చట మనము హాయిగా నివసింతుము
రామలక్ష్మణులు సీతతో గూడి కాలినడకన 
చిత్రకూటశైలమును చేరినారు 

సీతారామలక్ష్మణులు వాల్మీకి ఆశ్రమమునకేగి
దోసీలియొగ్గి మునీశ్వరునకు ప్రణమిల్లిరి 
వాల్మీకి వారికి స్వాగతము పలికి
ఆదరసత్కారములను నేరపెను 

కామెంట్‌లు
Popular posts