అమెరికాలో జగన్నాథ రథయాత్ర: - -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-సెయింట్ లూయిస్-అమెరికా

 

 చరాచర ప్రపంచంమును నడిపించే వాడు కాబట్టి అతను జగన్నాథుడు.మేము యు. ఎస్ లో మా అమ్మాయి ఇంటికి కరోనా తదనంతరం వెళ్ళినపుడు.  నాన్నగారు రేపటినుంచి  ఇస్కాన్ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జగన్నాథ రథయాత్ర చాలా బాగా జరుగుతుంది. అన్నది.
   నాకు చిన్నప్పటి నుంచి జగన్నాథ రథయాత్ర లో పాల్గొనడం సుమారు అరవై ఏళ్ళ బట్టి అలవాటు
మా విశాఖపట్నం లో  చాలా బాగా జరిగేది. బాల్యంలో అమ్మ నానమ్మలతో బాటు నేను వెళ్ళి  జగన్నాథుడు( శ్రీకృష్ణుడు)బలభద్రుడు వారి సోదరి సుభద్రలను ఆషాఢ శుద్ధ విదియ నాడు రథంలో పెట్టి  బలమైన తాళ్ళతో లాగడం అందరు చేయి వేసి లాగితే మంచిదంటే అమ్మ, నానమ్మలు నన్ను పట్టుకులాగమనేది. పుణ్యం చదువు వస్తాయి అని నానమ్మ తలమీద ముసుగు ఉడిపోయిన నన్ను ఎత్తుకుని రథాన్ని లాగించేది. ఇది అరవై  ఏళ్ళ క్రిందటనుంచి వస్తుంది భగవంతుని దయవల్ల నేను మార్గదర్శకుడుగా ఎందరినో తీర్చి దిద్దిన ఆచార్యునిగా పనిచేశాను.
      తప్పని పరిస్థితిలో మా అమ్మాయి తప్పక అమెరికా రావాలి అంటే ఏడుపదుల వయస్సులో వెళ్ళలసి వచ్చింది. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ పట్టణంలో ఇరవై ఏళ్ళయి ఉంటోంది. తను, భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గా పనిచేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. 
   మా అమ్మాయి నన్ను మా ఆవిడని రథయాత్ర కి తీసుకెళ్తే నాకు చెప్పలేని ఆనందం వేసింది. అక్కడ  మనభారతీయులే గాక విభిన్న దేశాల ప్రజలు హరే కృష్ణ భక్తులు తిలకధారణ, పంచెలు, చీరలు కట్టుకుని  భక్తి పారవశ్యం తో చేయడం  నాకు ఆనందం వేసింది. అక్కడి ఆత్మీయత భక్తి శ్రద్ధలతో చేసే పూజ, కృష్ణాష్టకం, భగవద్గీత  పిల్లలందరికీ  వివిధ దేశాల పిల్లలికి భగవద్గీత పోటీలు అందు నన్ను గౌరవించి న్యాయనిర్ణేతగా ఉండమనడం పదేళ్ళ అమెరికన్ బాలిక భక్తి యోగం గురించి చెప్పిన శ్లోకాలు విన్న నేను ఆశ్చర్యపోయాను
     అష్టోత్తర, శతనామాలతో పూజ చేసి, మంత్రపుష్పం చదివి ప్రసాదవితరణ చేయడం పెద్ద పదవిలో ఉన్నవాళ్ళు సహితం  భాష రాకపోయినా నమస్తే అంటు కొందరు పాదాభి వందనం చేసినపుడు అనుకున్నా నా బాల్యమిత్రుడు సిరివెన్నెల చెప్పినట్లు' జగమంత కుటుంబం' నాది అన్నది,
సనాతన ధర్మం చెప్పిన వసుదైక కుటుంబం అన్నది 
నిజమన్నది. ఇంటికి తిరిగి వస్తు మా అమ్మాయి తో అమ్మ నాకు చాలా సంతృప్తి గా ఉంది జగన్నాథ రథయాత్రలో పాల్గొనేటట్లు చేశావు అన్నప్పుడు నాన్నగారు ఇక్కడ అన్నీ బాగా జరుగుతాయి అని నలభై ఏళ్ళు దాటిన నా కూతురు చేయి పట్టుకుంటే ధీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాను...!!
..............................

కామెంట్‌లు
Popular posts