అన్నదమ్ములు...!!!: -డా ప్రతాప్ కౌటిళ్యా.


గాయపడ్డ గాలి అతడు 
రాలిపడ్డ చంద్రుడు ఇతడు 

ఆకాశంలో వెన్నెల అతడు 
నేలపై నెలవంక ఇతడు. 

దేవేంద్రుడు అతడు 
దేవుడు ఇతడు. 

ద్రోణాచార్యుడే అతడు 
తన భుజాన్నే ఇచ్చిన 
ఏకైక ఏకలవ్యుడు ఇతడు. 

కలలు కన్నా సముద్రుడు అతడు 
అలలను సుడిగుండాలను సృష్టించిన 
చంద్రుడు ఇతడు. 

భూమిపై వీచే పవనం అతడు 
ఆకాశంలో చల్లని వెన్నెల ఇతడు. 

ఒకరు తమ్ముడు 
ఒకరు అన్న 
దమ్మున్న అన్నదమ్ములు ఇద్దరు. 

గాయపడ్డ పవన్ ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు. 
============================================
డా ప్రతాప్ కౌటిళ్యా 
విశ్రాంత అధ్యాపకులు.
కామెంట్‌లు
Popular posts