నాయకుడు....!!: -డా ప్రతాప్ కౌటిళ్యా.


మనిషి పుడుతాడు చనిపోతాడు 
నది 
పుడుతుంది భూమంతా పారుతుంది. 
పదిమందికి పరిచయం అవుతుంది 
అందరికీ ఉపయోగపడుతుంది. 
చివరికి సముద్రంలో కలుస్తుంది. 

నిజమైన నాయకుడు కూడా అంతే..!!

మనిషి పుడతాడు చనిపోతాడు 
విత్తనం 
మట్టిలో మొలుస్తుంది మహావృక్షం అవుతుంది. 
వనమవుతుంది మహా రణ్యమవుతుంది.
ఫలాలను ఇస్తుంది పదిమంది కడుపు నింపుతుంది. 
ఎండిపోతుంది మనకు గుండెనిస్తుంది 
చివరికి మట్టిలో కలుస్తుంది. 

నిజమైన నాయకుడు కూడా అంతే....!!

మనిషి పుడతాడు చనిపోతాడు 
సూర్యుడు ఉదయిస్తాడు 
భూమంతా వెలుగునిస్తాడు 
మనకు మాటిస్తాడు మళ్లీ వస్తానని 
మళ్లీ ఉదయిస్తాడు చివరికి అస్తమిస్తాడు. 

నిజమైన నాయకుడు కూడా అంతే....!!!
=================================
డా ప్రతాప్ కౌటిళ్యా 
విశ్రాంత అధ్యాపకుడు.
కామెంట్‌లు
Popular posts