94వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
శ్రీరాముడు సీతాదేవితో  చిత్రకూటపర్వతప్రదేశమున విహరించుట



 

శ్రీరామునకు గిరులు దర్శించుటయందును 
వనములో విహరించుటకును 
మక్కువ ఎక్కువ సీతా లక్ష్మణులతో 
శ్రీరాముడు వనమున సంచరించుచు

సీతాదేవిని సంతోషముగా ఉంచుటకై 
చిత్రవిచిత్రములైన ఆ పర్వతశోభలను
తీరము చుట్టూ ఉన్న పుష్పములను 
శ్రీరాముడు ఆమెకు చూపుచుండెను. 

"ఓ శుభాంగీ! రాజ్యాధికారము దూరమైనగాని 
మిత్రులు చేరువలో లేనప్పటికీని 
ఇచ్చట రమణీయ దృశ్యములను చూచుచు
నా మనసు ఆనందంతో యున్నది. 

ఓ సుందరీ! ఈ చిత్రకూట పర్వతముయొక్క
అందాలపై నీదృష్టిని ప్రసరింపజేయుము 
ఎత్తైన శిఖరములు దీనిని తాకుచున్నవి 
దాని పైనుండి వచ్చు జలాలు కనువిందు జేస్తున్నాయి.

ఓ కళ్యాణీ! ఆహ్లాదకరమైన కొండల వద్ద 
ప్రేమానురాగంతో జంటలు జంటలుగా 
విహరించే కిన్నెర జాతి వారిని జూడుము
నీకు కూడా ఆనందంగా యుండును.
 

కామెంట్‌లు