ముద్దబంతి పువ్వు!
సిగ చేరితే ఆ పువ్వు!
చూడామణే అవ్వు!
బంతిపూల తోట!
వెలకట్టలేని కోట!
మకరందాల ఊట!
మనసుకు ఊరట!
ముద్ద బంతుల రాసులు!
మూగమనసుల బాసలు!
విరిసే వింత సొగసులు!
కలిసే జంటల మనసులు!
గంపలకెత్తిన పూలు!
ఇంతుల చేతి బంతులు!
గుమ్మాలకు పసిడి హారాలు!
ముచ్చటైన బొకేల రూపాలు!
బంతిపూల సాగు!
ఉపాధిగా కొనసాగు!
బతుకు తెరువు ఆగు!
మనిషికి ఎంతో బాగు!
రైలు ప్రయాణ భాగ్యం!
బంతిపూల తోటల సందర్శనం!
నయనానందకర వీక్షణం!
గురుతుండే మధుర క్షణం!
_________
________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి