మనసు అల్లే చీర కల!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765.


కలల రాకుమారుడు రెక్కల గుర్రం, పైన రావడం, అందమైన రాకుమార్తెల తో ఉద్యానవన విహారాలు
కలలు.... కలకానిది విలువైనది
జీవితం అని చెప్పే నిజం గుర్తింపచేసే, సినీ గీతాలు విన్నాం.
కలలు కనడం సహజమే.  అయితే కల ఏంటి? 
ఏదైనా వ్యక్తి సాధించాలనుకున్నప్పుడు, నిత్య నిరంతరంగా కృషి చేయడం, సాధారణంగా జరిగే అంశం. అయితే వ్యక్తిగత జీవితంలో సాధించాలని లక్ష్యం ఆకాంక్ష,కల గా రూపొందుతుంది. 
పగటి ఆలోచనలనే దారాలతో రాత్రి ఊహల తో ఇది అల్లబడుతుంది. 
నిద్రలో కనిపించే దృశ్యాల శ్రేణయే కల (dream). ఇది మెదడులో ఏర్పడే దృశ్య శ్రవణ అనుభూతుల తలపోత. మనం నిద్రపోతున్నప్పుడు మన మనసు మనకు చూపించే ఒక సినిమా లాంటిది కల. అలాగే మన నిద్రపోయినప్పుడు బ్రెయిన్ ఆఫ్ అవదు. ఈ సమయంలో మెదడు చాలా పనులను చేస్తుంది. కలలు ఆ చేతన మనసు పంపే వాట్సాప్ మెసేజ్ లాంటివి.

 స్వప్న విచారం!!

కలను స్వప్నం అంటారు. స్వప్న శాస్త్రం లేదా స్వప్న విచార శాస్త్రాన్ని ఎప్పుడో రాయడం జరిగింది. బృహత్ సంహిత అగ్ని పురాణాల్లో ఒక అధ్యాయం స్వప్న అధ్యాయం. 
ఇందులో వేయి కలల ఫలితాలు ఉన్నాయి. ఉపనిషత్తుల ప్రకారం మనసు యొక్క సృష్టిగా కలను పేర్కొనడం జరిగింది. 
అధర్వణ వేదంలో కూడా (19.56) కలల ప్రస్తావన మంత్రాలు ఉన్నాయి. 
కల మొత్తం ఆత్మ యొక్క సంకల్పం అని చెప్పడం జరిగింది. బృహదారణ్యక ఉపనిషత్(4.3) కలలో ఆత్మ ఏం చేస్తుందో అని అందంగా చెప్పడం జరిగింది. 
ప్రశ్నోపనిషత్తులో... ఏష  సప్నే మహీయ మనశ్చరతి ... 
ఆత్మ కలలో గొప్పగా విహరిస్తుంది. కలలో అన్ని లోకాలకి వెళుతుందని చెప్పడం జరిగింది .
బృహత్ సంహితలో అగ్ని పురాణంలో స్వప్నధ్యాయ అనే ఒక అధ్యాయంలో చాలా అంశాలు చర్చించడం జరిగింది. 
వరాహ మిహిరుడు స్వప్న శాస్త్రంలో ఏ కలకి ఏ ఫలితం వస్తుంది అని తెలియజేశాడు. 
చెడు కలల ప్రాయశ్చితాన్ని శాంతి విధులన్నింటిని గరుడ పురాణంలో పేర్కొనడం జరిగింది. 
మాండూక్య బృహదారణ్యక ఉపనిషత్తులో కల యొక్క తత్వం గురించిన విచారణ చేశారు. కలలు వచ్చిన వారం తిథి సమయాన్నిబట్టి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్శాస్త్రంలో  తెలియజేయడం జరిగింది. కలలు మార్గదర్శకాలు కావు ఆదేశాలు కావు. 

కలలు ఏం చెబుతాయి?

ఒక ధైర్యవచనం చెప్పినటువంటివే కలలు. 
రామాయణంలో త్రిజట స్వప్నం సీతకి ధైర్యం చెబుతూ రాముడి విజయం గురించి ముందుగానే తెలియజేయడం జరిగింది. 
ద్రౌపదికలలో వనవాసంలో పాండవులు కష్టపడుతుంటే కృష్ణుడు వచ్చి భయపడకు అని ధైర్యం చెప్పటం మూలాన 
వాళ్లకి కొంత సంతృప్తి కలిగింది. 
భాగవతంలో కృష్ణుడు పుట్టుక ముందే దేవకికి దివ్యమైన కాంతి కల వచ్చింది. అదే అవతార సూచన. 
లేవండి మేల్కోండి లక్ష్యం దాకా చేరేదాకా ఆగకండి అనేది 
స్వామి వివేకానందుని కల.  పెద్దకలతో చిన్న అడుగు వేయు.. అదే నీ పెద్ద విజయానికి నాంది ...అని పేర్కొనడం జరిగింది.
కలలు కనండి కలలను నిజం చేయండి అన్న ఏపీజే అబ్దుల్ కలాం మాట ఇస్రో అయింది.  మిస్సైల్ అయింది.. ఈ వాక్యం  ప్రపంచానికి ఒక పాఠాన్ని నేర్పింది.
కవి కలం నుండి జాలువారేది సిరా కాదు. ఒక జాతి కల అంటారు.

మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల కల!!

అణిచివేయబడ్డ కోరికల యొక్క రూపాంతరo చెందిన తృప్తిని కల అంటాడు. ఫ్రాయిడ్ 
Dream is the disguised full film and of repressed wish. 
పగటిపూట మనం చెప్పుకోలేని కోరికలు, భయాలు ఆందోళనలు, కల రూపంలో బయటికి వస్తాయి. అంతమాత్రాన అవి నిజమవుతాయని మనం విశ్వసించాల్సిన పనిలేదు. ఒకవేళ అవి నిజం కావాలంటే దానికి కావాల్సిన ప్రణాళిక బద్ధమైన అంశాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. 
అచేతన అనే స్థితి నుండి మనసు చేతన అనే మనసుకు ఇచ్చే సందేశమే కల అంటాడు యాంగ్. 
Dreams are the natural expression of unconscious psyche. 
మనం పడుకున్నప్పుడు (అ చేతనస్థితి ) కలను కంటాం. 
మళ్లీ మెలుకువ (చేతన స్థితి) తర్వాత దానినిగురించి ఆలోచిస్తాం.
కల అనేది ప్రకృతి యొక్క స్వీయ చికిత్స విధానం అని కూడా అంటారు. కలలు మనకు శిక్షించడానికి కాదు నయం చేయడానికి ఎదగడానికి ఉపయోగపడతాయి. 
మోడరన్ సైకాలజీ ప్రకారం మెదడు చేసే ఫైల్ ప్రాసెసింగ్ ను 
కల అంటారు. 
రోజంతా విన్నవి చూసినవి ఫీల్ అయిన వాటిని ఒక ఫైల్ చేసే విధానాన్ని కల అంటారు. 
అలాగే రేపటి సమస్యలకు మనసు చేసే రిహార్సల్ కల. 

కలలను సాకారం చేసుకుందాం!!

కలలు కంటే పరవాలేదు. 
కానీ పగటి కలల మాత్రo వద్దు.  వ్యక్తిగత కలలు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి. ఆశను ధైర్యాన్ని ఇస్తాయి. 
సృజనాత్మకతను పెంచేవి కలలు. సైన్సు సాహిత్యం సినిమా రంగాల్లో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. 
మనసుకు శాంతినిచ్చి, కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని కూడా కలలు అందిస్తాయి.. ఐన్స్టీన్ కు సిద్ధాంతాలు కలలోకి కనపడినాయట.
ఒక డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి మంచి కల దోహదపడుతుంది. 
అలాగే అతిగా ఊహించుకోవడం, కోటీశ్వరులైనట్లు కలగనటం,
కార్లు, భవంతులు, ఆస్తులు ఊరికే వచ్చినట్లు కలగనడం ద్వారా సహకారం అవడం అటు నుంచి వ్యక్తికి మానసిక ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది.
 కల కోసం బతకొద్దు. జీవితంలో కలను ఒక దారిగా మార్చుకొని అడుగులు వేసినప్పుడు విజయం సాధించే అవకాశం ఉంటుంది. 


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
మనసు అల్లే చీర కల మీ వ్యాసం చాలా గొప్పగా ఉంది సర్ స్వప్న శాస్త్రం పురాణాలు ఇస్రో ఫ్రాయిడ్ అచేతన స్థితి నుండి చేతన స్థితి లో ఏర్పడే మానసిక స్పష్టత కలల ద్వారా విజయం సాధించే అవకాశాలు మీ వివరణ అద్భుతం సార్
అజ్ఞాత చెప్పారు…
Super sir
కల
అలా వస్తూనే ఉంటాయి
అలలు
ప్రతి అల తీరం దాటి ముందుకు పోవాలని కానీ తిరిగి సముద్రం వెనుకకు తీసుకుంటుంది
అలా మనిషికి కల కూడ అలలా
సముద్రనికి అలలు అందం
మనకు కలలు అందం
Popular posts