కొల్చితిమి దేవరా!కూర్మితో కాపాడు!
పత్రిపూలను తెచ్చి పరవశంబున నిల్చి
నీదు పూజను సల్పి నిల్చితిమి నాయకా!
ఆదిపూజ్యుడవీవె!అంబికాసుత మాకు
శాంతినిడు వరదుడా!జయమంచు పల్కితిమి.
సిద్ధిబుద్దుల నిచ్చు సౌభాగ్య దాయకా!
యుద్దభీతిని మాన్పి యోదార్పరావయ్య!
ఘోరప్రళయములకు కోల్పోవ జీవములు
ధరణికీ వేళలో దాపురించెను భయము.
జీవతతి యల్లాడ క్షేమంకర!శుభదా!
బ్రోవరావ!గణపతి!భువికి నీవే రక్ష!
వేవేల స్తుతులతో వేడ్కగా నుతియించి
ప్రార్థింతుమయ్య!నీ పాదంబులే దిక్కు!
నీ దివ్య మూర్తిని నెమ్మదిగ కీర్తించి
సేవలను సల్పెదము శంకరప్రియనంద!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి