కాలజ్ఞాని : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-సెయింట్ లూయిస్ - అమెరికా.


శరీరం అశాశ్వతమని  కాల ప్రవాహానికి
ఎవరు ఎదురీదలేరని బ్రహ్మా నుదిటి పై లిఖించిన వ్రాత ఎంతటివారికైనా తప్పదని 
అసూయ ద్వేషాలు, అహంకార ఆడంబరాలు
జీవిత వినాశనానికి దోహాదాలని
కులమత బేధాలు సమసి పోవాలని 
పరితపించి ఆచరణలో పెట్టిన పోతులూరి వీరబ్రహ్మం గారు సమాజహితుడు.

ఆత్మజ్ఞానం ముఖ్యమని 
తన సాధనతో భవిష్యత్ లో జరిగే అనేక విషయాలను చెప్పి 
ప్రజలను సన్మార్గంలో 
జీవించమని
దేముడు ఎక్కడో లేడని 
మానవత్వమే మాధవత్వమని
కోరికలను జయించి 
మనసును అదుపులో పెట్టుకునేవాడు
జీవితాన ఏదైనా సాధించవచ్చని
కాలజ్ఞానమనే గ్రంథంతో 
భవిష్యత్ లో జరిగి విషయాలను ముందే చెప్పిన సిద్ధపురుషులు.

మంచితనం,మానవత్వం
అన్నార్తుల పేదల సహాయం చేయడమే 
పరమాత్ముని సేవ అని 
ఆనాడే చెప్పిన 
ఆ మహనీయుని అడుగు జాడల్లో నడచి 
సమ సమాజ నిర్మాణం ఏర్పరచి 
వసుదైకాన్ని రక్షించు కోవడం మనందరి కర్తవ్యం..!!
..............................

కామెంట్‌లు
Popular posts