వాలి నేలగూలిన వార్తను విని దుఃఖితయైన తార అంగదునితో గూడి రణభూమికి బయలుదేరుట
శ్రీరాముడు ప్రయోగించిన బాణముయొక్క దెబ్బకు
మిక్కిలి గాయపడి పడిపోయినట్టుగా
అతని భార్యయగు తారకు తెలిసెను
ఆ అప్రియవార్తను విని భయముతో చలించెను
వెంటనే కుమారునితో గూడి అటువచ్చెను
ఆమె పారిపోవుచున్న వానరవీరులను జూచి
ఆమె మిగుల దుఃఖిస్తూ వారితో ఇట్లనెను
ఓ వానరవీరులారా! మహారాజైన వాలికి
మీరందరును అనుచరులే గదా! ఆ స్వామిని వీడి
దిక్కులేని వారి వలె బీతితో పరుగులు తీయుచున్నారు
మీకు బీతి వద్దు ఇది సుగ్రీవుడు పన్నిన పన్నాగము
ఆ వానరులు ఆమెతో ఇట్లు పలికిరి
ఓ దేవీ! మృత్యువు శ్రీరామునిరూపులో
వాలిని హతమార్చి తీసుకొని పోవుచున్నది
నీ పుత్రుడైన అంగదుడిని రక్షించుకొనుటకై మరలి రమ్ము
మృతిచెందిన భర్తను చూచి మిగుల శోకించుచు
వానరుల మాటలు విని తారా ఇట్లనెను
ఓ వానరవీరులారా! నా భర్త మృతి చెందిన పిమ్మట
నాకు పుత్రునితో పని యేమి? రాజ్యముతో పని ఏమి?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి