రక్తమాంసాలనే కాదు,
బుద్ధికుశలతను కూడా పుణికిపుచ్చుకోవాలిమనం
బిడ్డలకై పరితపించే
ప్రేమైకమూర్తే అమ్మ
ఆకలిగొన్న వేళ
అన్నపూర్ణేశ్వరమ్మ
బాధనంతా తానుదిగమ్రింగి
మన బ్రతుకును ఆనందమయం చేసిందమ్మ
త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం అమ్మ
మనకు జన్మనిచ్చి
తాను పునర్జన్మెత్తి మనకీ ఆకృతినిచ్చి భోగభాగ్యాలనొసగి
మన బ్రతుకునుపూలవనం
చేసింది అమ్మే
అమ్మను దూషించకు
నిన్ను నిన్నుగా
ప్రేమించే
దయామయిని దూరం చేసుకోకు
ఎవరూ లేని అనాథగా
వృద్ధాశ్రమంలో వేయకు
అమ్మను వార్థక్యంలో
మనకన్నబిడ్డలా
చూసుకుందాం
అమ్మను ఆదరిద్దాం
అమ్మపై అవ్యాజమైన ప్రేమనుచూపుదాం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి