తైలం అయిపోయాక
కొండెక్కాల్సిందే
అలాగే ప్రాణదీపం కూడా
ఆరిపోవలసిందే కదా!
జీవన ప్రయాణాలన్నీ
ఎక్కడో ఒకచోట
మహాభినిష్క్రమణమయ్యేవేకదా!
తీరని కోరికలు
మనఃక్లేషాలై
జీవన పర్యంతం
శోకగీతయ్యేవేకదా!
ఒంట్లో జవసత్తువలు
శ్వాసపై ధ్యాసలు
సవాళ్లకు జడవని విశ్వాసం
ఒకచో బలహీనమై
బలం బలగం చేజారిపోయేవేకదా!
పురాణేతిహాసాలు
ఏదీ ప్రబోధించిన
ఆచరణకు నోచుకుంటే
నీకు నువ్వే బాసటా
మనస్సునే జయించిన వాడివి నువ్వూ
కోరికలగుర్రాలు నిన్ను చూస్తే తోక ముడిచేవే కదా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి