రేపటి బాలల కోసం..!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


తరతరాలకు సరిపడే గాలి మనకు లేదు 
తరతరాలకు సరిపడే నీరు మనకు లేదు 
తరతరాలకు సరిపడే భూమి మనకు లేదు. 

మనకున్నది భూమి ఒక్కటే 
దాన్ని కాపాడుకుందాం. 
మనకున్నది గాలి ఒక్కటే 
దాన్ని కలుషితం కాకుండా చూసుకుందాం. 
మనకున్నది నీరు ఒక్కటే 
నీటి నిలువలు పెంచుకుందాం. 

ఇంతకుముందు నదుల కిరువైపులా 
ఊర్లూ ఉండేవి.
ఇప్పుడు రహదారుల కిరువైపులా 
నగరాలు ఊర్లు ఉన్నాయి.

అడవులు అంతరిస్తున్నాయి 
చెరువులు కాలువలు అంతరిస్తున్నాయి. 
నగరాలు మొలుస్తున్నవి 
రహదారులు విస్తరిస్తున్నాయి 

వర్షాలు కురుస్తలేవు 
పంటలు పండటం లేదు 
కరువు తరుముకొస్తుంది. 

చెట్లను పెంచుదాం 
నదులను చెరువులను కాపాడుదాం 
అడవులను పెంచుదాం 
భూమిని కాపాడుదాం రేపటి బాలల కోసం. 

తర్వాతి తరాలకు 
స్వచ్ఛమైన గాలిని 
స్వచ్ఛమైన నీటిని 
స్వచ్ఛమైన మట్టినిద్దాం.!!
==================================
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని. 
=======================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు
Popular posts