సుగ్రీవుని సైన్యం-పురాణకథ-డా.బెల్లంకొండనాగేశ్వరరావు-చెన్నయ్ . ఇంద్రునికి అహల్యకు జన్మించిన వారు వాలి-సుగ్రీవులు గౌతమమునిచే కొతిరూపంపొందాలని శపించబడి వెలివేయగా,"ఋక్షవిరజుడు"వీరినిపెంచుతాడు.సుశేషుణుని కుమార్తే "తార"వాలిభార్య .రావణుని గర్వమణచడంతో పాటు" దుంధుభి"అనేరాక్షసుడినిచంపి అతని కళేబరాన్ని విసిరివేయడంతో రుష్యమూకపర్వతం పై ఉన్న మాతంగముని ఆశ్రమం పై రక్తం పడటంతోకోపించిన ముని ఈపర్వతపై అడుగిడితే మరణిస్తావు అనిశపిస్తాడు.వాలితో సుగ్రీవుడు వైరంఏర్పడినతరువాత సుగ్రీవుడు రుష్యమూకపర్వతంపైనేఉండి ,శ్రీరాముని మైత్రిచేసుకొని రామునిద్వారా వాలినివధించి తనురాజు అవుతాడు రామాయణం లో సుగ్రీవుని సైన్యబలాన్ని"పత్తి"నుండి"వెల్లువ"వరకు పలుస్ధాయిలుగా విభజించారు.ఒకరథము, ఒకఏనుగు, మూడుగుర్రాలు, ఐదుగురుకాల్బలము (సైనికులు )కలిపి "పత్తి" అంటారు, దీనికిమూడురెట్లుకలిస్తే"సేనాముఖం"అంటారు.దీనికిమూడు రెట్లుకలిపితే దాన్ని"గుల్మము"అంటారు. దానికిమూడు రెట్లుకలిపితే "గణము"అంటారు. దానికిమూడురెట్లుకలిపితే"వాహిని"మూడువాహినీలుకలిస్తే"పృతన"మూడుపృతనలుకలిస్తే"చమువు"మూడుచమువులుకలిస్తే"అనీకిని" పదిఅనీకినీలు కలిపితే ఒక"అక్షౌహిణి"అవుతుంది.ఒకఅక్షౌహిణీలో1.09.350మందిసైనికులు.21.870.రథాలు.21.870ఏనుగులు.65.610గుర్రాలుఉంటాయి. ఎనిమిది అక్షౌహిణీలు ఒక"ఏకము"ఎనిమిది ఏకాలు ఒక"కోటి"(ఇప్పటికోటికాదు ) ఎనిమిదికోట్లుకలిపితే ఒక"శంఖము" ఎనిమిదిశంఖాలుఒక"కుముదము" ఎనిమిది కుముదములు కలిపితే ఒక"పద్మము" ఎనిమిది పద్మా...లు కలిపితే"ఒక"నాడి" ఎనిమిది నాడులు కలిపితే ఒక"సముద్రము"ఎనిమిది సముద్రాలు కలిపితే అంటే-366917139200.మందిగలసేనకి"వెల్లువ"అనిపేరు.యిటువంటి డెభై వెల్లువల సైన్యం సుగ్రీవునివద్దఉందని రామాయణం తెలియజేస్తుంది.అంటే సుగ్రీవునిసైన్యంసంఖ్య-256842399744000.మంది అన్నమాట.వీరిలొ అరవై ఏడు కోట్లమంది సైన్యాధిపతులు ఉండేవారు.వీరందరికి "నిలుడు"అనేవానరవీరుడు అథిపతిగాఉండేవాడు.వీరుకాకుండా.శతబలి-సుషేణుడు-కేసరి-గవాక్షుడు-ధూమ్రుడు-జాంబవంతుడు-నీలుడు-గవయుడు-మైంద-ద్వివిధ-గజుడు-గంధముఖుడు-శరభ-కుముద-ప్రమతి-క్రథనుడు-సన్నాధనుడు-ధంభుడు-క్రోధనుడు-శ్వేతుడు-సముడు-నలుడు-ఋషబ-వనస-రంహుడు-వహ్ని-దుర్ముఖుడు-రంభుడు-పనసుడు-తారుడు-హనుమంతుడు-అంగదుడు-ఇంద్రజానుడు-గంధవాహనుడు-రమణ్వంతుడు-ధధిముఖి వంటి వానరప్రముఖులు ఉన్నారు.సీతాదేవి ని అన్వేషించడానికి,శతవలిఉత్తరదిశగా-వినతుడు తూర్పుదిశగా-సుశేణుడు పశ్చిమదిశగా-రాముని ఉంగరాన్ని ఆశీర్వాదాన్ని పొందిన హనుమంతుడు దక్షణదిశగా వెళ్ళి సీతాదేవి జాడకనుగొన్నాడు.


కామెంట్‌లు