పోలీసుల సమయస్ఫూర్తి.. పరీక్ష రాసిన విద్యార్థులు ------పోలీసుల సమయస్ఫూర్తి ఇంటర్‌ విద్యార్థుల భవిష్యత్తును కాపాడింది. బస్సు రాకపోవడంతో ఆరుగురు విద్యార్థులు ఆందోళనకు గురై.. వెంటనే 100కు డయల్‌ చేశారు. దీంతో పోలీసులు వచ్చి వారిని పరీక్ష కేంద్రానికి సమయానికి చేర్చారు. ఈ సంఘటన లోకేశ్వరంలో చోటుచేసుకుంది. మండలంలోని రాయపూర్‌కాండ్లీ, నగర్‌ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలకేంద్రంలోని పరీక్షకేంద్రంలో ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నారు. శుక్రవారం బస్‌ కోసం వేచిచూసినా.. సమయానికి రాలేదు. దీంతో వారు వెంటనే 100కు డయల్‌ చేశారు. వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై యాసీర్‌అరాఫత్‌ తన వాహనంలో ఆయా గ్రామాలకు చేరుకుని వారిని వాహనంలో ఎక్కించుకుని పరీక్ష కేంద్రం వద్ద వదిలిపెట్టారు. మరో ఐదు నిమిషాలు ఆలస్యమైతే విద్యార్థులు పరీక్షకు దూరమయ్యేవారు. పోలీసుల సమయస్ఫూర్తిని గ్రామస్తులు అభినందించారు.(సాక్షి సౌజన్యంతో)


కామెంట్‌లు