పశ్చాత్తాపం:-ఇ.వైష్ణవి-10వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల గణపురం-జనగామ జిల్లా
 గుమ్మడవెల్లి అనే గ్రామంలో రామయ్య,లక్ష్మీ అనే దంపతులు ఉండేవారు. ఊరిలో ఉన్న పొలంలో వ్యవసాయం చేస్తూ  జీవిస్తూ ఉండేవారు. పెళ్లయిన చాలా సంవత్సరాలకు వారికి కవల పిల్లలు పుట్టారు. అందులో ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి రామయ్యకు ఆడపిల్లలంటే అసలు నచ్చదు.అందుకే తన తమ్ముడైన బుచ్చయ్య అనిత దంపతులకు అమ్మాయిని దత్తతకి ఇస్తారు.వాళ్ళకి పిల్లలు లేరు.రామయ్య తన కొడుకుకి అంజి అని పేరు పెట్టి గారాబంగా చూసుకునేవాడు.ఏది అడిగినా ఇచ్చేవాడు.ఎంత అల్లరి చేసినా భరించేవాడు. బుచ్చయ్య కూతురికి సీత అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. తన కూతురు సీతను ఎంతో పద్ధతిగా,క్రమశిక్షణగా పెంచుతాడు.కాని రామయ్య,అనితలు అంజిని చాలా గారాభం చేసేవారు.తన తల్లి అంజని చిన్నమాట తన తండ్రి అసలే ఊరుకునే వాడు. పాఠశాలకు సరిగా వెళ్లకుండా ఏమని వాడు కాదు సరిగా చదివేవాడు కాదు.కాని సీతా చదువులో చురుకైన అమ్మాయి.తనకు వైద్యురాలు కావాలనే కోరిక ఉండేది.అందుకు ఆమెను హైదరాబాద్ పంపించి చదివిస్తాడు రామయ్య. పట్టణంలో చక్కగా చదువుకొని మంచి ప్రతిభ చూపుతుంది. రామయ్య  కొడుకు అంజి చదువు సంధ్య లేకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడి చదువు మీద శ్రద్ధ లేకుండా అన్ని పరీక్షల్లో తప్పుతాడు. రామయ్య కొడుకుని ఏమీ అనడు.కానీ తల్లి హైదరాబాదుకు పని వెళ్లి ఏదైనా పని చేసుకో అని చెప్తుంది.కానీ తన భర్త ఒప్పుకోడు.అంజి అంటే అతనికి ప్రాణం. అందరూ చదువు గురించి అడగడం జులాయిగా తిరుగుతున్న అంజికి నచ్చలేదు.ఒకరోజు అంజికి కొన్ని రోజులు హైదరాబాద్ వెళ్లాలని కోరిక పుడుతుంది.ఆ విషయాన్ని తన తండ్రితో చెప్తాడు. కొడుకు మీద ఉన్న ప్రేమతో రామయ్య హైదరాబాద్ పంపడానికి వెంటనే ఒప్పుకుంటాడు. అక్కడ కూడా ఏ పని చేయకుండా ఇంటి దగ్గర నుండి పంపిన డబ్బులను దుబారా చేస్తూ, మత్తు పదార్థాలకు బానిసైపోతాడు. చెడి స్నేహాలతో మత్తు పదార్థాలు తాగడమే కాకుండా,మత్తు పదార్థాలను సరఫరా చేస్తూ బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు.కానీ ఒకరోజు పోలీసులకు దొరికిపోతాడు.అదే సమయంలో సీత వైద్యురాలిగా ఇంటికి తిరిగి వస్తుంది ఫోను వస్తుంది.నీ కొడుకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తే దొరికిపోవడంతో పోలీస్ స్టేషన్లో వేసామని రామయ్య తో రామయ్య గుండె చెరువు అవుతుంది చాలా బాధపడతాడు కొడుకును గారాబంగా చేసుకున్నందుకు తగిన శిక్ష పడిందని బాధపడతాడు.అప్పుడే సీత డాక్టర్ విద్య పూర్తి చేసిందని తెలుస్తుంది. రామయ్య బాధతో గొప్ప కూలిపోతాడు.కూతురుకు చేసిన అన్యాయం నాకు ఈ విధంగా తగిన శాస్తి జరిగిందని బాధపడతాడు.
చిన్నప్పుడే తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేసినందుకు దేవుడు తగిన శిక్ష వేశాడని బాధపడతాడు. కొడుకైనా కూతురైనా పద్ధతిగా పెంచితే సమాజంలో ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారని అనుకుంటాడు. ఆడపిల్లలను భారంగా భావించకూడదని,వారు కుటుంబానికి ఆధారమవుతారని తెలుసుకుంటాడు.


కామెంట్‌లు