చిన్నారి బాలలకు పెద్దబడంటే(హైస్కూల్)అంటే భయం ఉండకూడదని,ముందు ముందు తాము చెరబోయే పెద్దబడుల్లో బోధనావిధానం ఎలా ఉంటుంది?అక్కడి పరిసరాలు ఎలా ఉంటాయి?ముందుగానే పిల్లలకు పరిచయం చేసి,ఉన్నత విద్యపై విద్యార్థంలకు ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో,జిల్లావిద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు,కడవెండి ప్రాథమిక పాఠశాల 4,5తరగతుల విద్యార్థులు మా పాఠశాలను సందర్శించారు.మా పాఠశాల విద్యార్థులతో కలిసి,అన్నా,అక్కా అంటూ అనుభూతంలు పంచుకుంటేనే,మా పాఠశాల లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.ఆడారు.పాడారు.ఆనందం పంచుకున్నారు.ఒకానొక సమయంలో నేనడిగిన ప్రశ్నకు ఒక విద్యా‌ర్థి,సమాధానం చెప్పడానికి ఇలా కిటికీ ఎక్కి మరీ ,గోడపత్రిక చూపించాడు.వీరికోసం మా పాఠశాల విద్యార్థులు ప్రత్యేక బాలలసభ నిర్వహించారు.-పద్మ ప్రసాద్ త్రిపురారి


కామెంట్‌లు