🌹🙏 *మహిళలకు...వందనం*🙏🌹 అమృతంలాంటి ప్రేమను పంచె అమ్మవునీవు సంసారసాగారంలో సహనం కలిగిన తపస్వి నీవు మనిషి పుట్టుకకు కారణమయ్యావు సృష్టికి ప్రతిసృష్టిగా నిలిచావు ఆళిగా ఆదరణచూపావు కుటుంబానికి ఆదరువైనావు కసాయికాలంలో కనికరం కరువైన నిరంతరం శ్రమజీవిగా విద్య వైద్యలో ఆటపాటలతో ప్రతిభను చూపుతున్న చైతన్యదీప్తివి జీవనజ్యోతివి మా సిరిగల తల్లివి ఎన్నో రూపాలు మరెన్నో ఇక్కట్లు వరకట్నం సమస్యతో నిత్యం వేదింపులతో కామాంధుల వికృతచేష్టలకు దిశానిర్దేశంతో నిర్భయలా బలైతున్నావు అసమానతల నడుమ కట్టుబాట్ల ముళ్ల కంచెలో అవమానపు అంచులతో రక్కసికోరల నడుమ నిప్పుల రవ్వగా నిలిచిన త్యాగమూర్తివి నీవు చీరను చుట్టి చీపురును పట్టి సొగసును పెంచిన సద్గుణరాసివి మా ఇంటి నీడవు మా కంటి కనుపాపవు నీవు కుటుంభ ప్రగతికి బీజం నీవు మా విజయసారథివి నీవు మా సౌభాగ్యరాశివి నీవు ఝాన్సీ రుద్రమలా కత్తిపట్టిన వీరమాతవు నీవు ఆత్మీయానురాగాలను పంచిన కల్పతరువు నీవు మా వెలుగు రేఖవు నీవు పొగడ్తలకు పొంగిపోయినావు తెగడ్తలకు కుంగిపోయినావు నీ పై స్వార్థం చూపిన నిస్వార్ధంగా నిలిచావు అందుకే నీకు సరిరారెవ్వరు నీకు లేదు సాటి నీ ప్రేమకు లేదు పోటీ మహిళలలు అబలలు కాదు సభలలు అని తెలుపుతూ మహిళామణులందరికి నా కవితాక్షరాలతో కృతజ్ఞతాభివందనాలు.. 🙏🙏🙏🙏🙏🙏 ✍️.. *డా.తెలుగు తిరుమలేష్* *తెరసం జిల్లా అధ్యక్షులు* అమరచింత మండలం, వనపర్తి జిల్లా. *9908910398*


కామెంట్‌లు