కన్నెగంటి వెంకటయ్య అనే నేను ఎస్.ఏ తెలుగుగా ...కవిగాయకునిగా తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకరచయితగా బాలలచే కవితా రచనలు చేయిస్తూ సంపాదకత్వం వహించి ఔదార్యం గల దాతల ఆర్థిక సహకారంతో సహోపాధ్యాయుల తోడ్పాటుతో ఇప్పటికి మూడు కవితా సంకలనాలు వెలువరించాను. 1. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఉన్నత పాఠశాల విద్యార్థులచే 2003 లో కవిత్వం రాయించి నేను వెలువరించిన తొలి కవితా బాలల కవితా సంకలనం 'చిగురాకుల సవ్వడి' ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి బాల కవుల కవితా సంకలనంగా బాలసాహితివేత్త గరిపల్లి అశోక్ గారు నిర్దేశించారు . 2 నేను 2017 లో ముదిగొండ ఉన్నత పాఠశాల బాలకవులచే వెలువరించిన మరో వచన కవితా సంకలనం ' ముదిగొండ ముత్యాలు' 3 నేను 2019 లో' కోయిలాలో కోయిల' గేయ కవితా సంకలనం వెలువరించాను.ఇది బాల సాహిత్యం లో బాలలే రచించిన తొలి గేయ కవితా సంకలనంగా బాలసాహితి వేత్త డా.పత్తి పాక మోహన్ గారిచే ప్రస్తుతించబడింది....


కామెంట్‌లు