కరోనా శత పద్యాలు (ఆటవెలది)- ఉండ్రాల రాజేశం 21) కేంద్ర యండతోని కెసిఆర్ అడుగేసి బస్సు లారి కారు బండితోడ లాభనష్టమనక లాక్ డౌన్ యనుచు చెప్పి రోడ్లనన్ని మూసి రూల్సు తెలిపె 22) పల్లె పట్నమందు పలు దుకాణాలు మూసి వేసినారు మొదటగాను చరిత లేనిదంటు చిత్రపోయి జనులు కడప దాటకుండ్రి కష్టమనక 23) దేశమంత బందు దిశలన్ని మూసిరి రైలు కూతలేదు రాజ్యమందు మూసి వేసినారు ముందు విమానాలు రాకపోకలేక రంది కలిగె 24) మద్య మమ్మకున్న మందు బాబుల యెడ్పు పిచ్చి పిచ్చి చేసి పిరికిలైరి కల్లు గూడలేక కాకవికలు గాను కంటనీరు పెట్టి యింటవుండ్రి 25) ఊరు వాడ మూత పోరు జేయనిలిచి చుట్టమన్న మాట కట్టిపెట్టి బండి కదలలేదు బాటలు సాగక బాధ వోర్చుతుండ్రి పల్లె జనులు 26) కూడులేక వున్న కోట్లాది మందికి బియ్యమిచ్చినారు బోధజేసి డబ్బు బ్యాంకులేసి డమరుక మోగించి ఇంట వుండుమనిరి కంటనిలిచి 27) కూరగాయలిచ్చి కునుకు తీయమనుచు ప్రజలసేవ జేయు ప్రతినిధులును పట్టుదలన కదిలి పాలకవర్గము పగలు రాత్రియనక బాటనుండ్రి 28) లాఠి చేతబట్టి లాగులు పగిలేల తరుముతుండ్రి చూడు తుంటరోళ్ళ మంచి చెడ్డలున్న మహనీయ పోలీసు నీవు లేని చోట తావులేదు 29) వచ్చి పోవు జనుల వరుసగా పంపుతూ గీత దాటుతున్న వేటలాడి వినని వారినట్టి పైనులు వేయుచూ రక్ష గుండినారు శిక్షజూపి 30) వాత లెట్టుతున్న వారేవ్వ పోలీసు నీదు సేవ ఘనము నేలయందు జీబు మోతలిన్న బాబులంత పరుగు మాట కఠినమైన మంచి మనసు


కామెంట్‌లు