ముల్లా కథలు - 23--ఎప్పుడూ గొడవపడు!!--- ఓరోజు భార్య చేసిన పని సహించలేక ముల్లా ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాడు. ఇంకా చేతి దెబ్బ తినకముందే ఆమె ఏడుస్తూ వీధిలోకొచ్చింది. అయినా ముల్లా ఆగకుండా వెంటపడ్డాడు.ఆమె ఓ ఇంట్లోకి జొరబడింది. ముల్లా కోపంగా అరుస్తూ ఆ ఇంట్లోకి జొరబడ్డాడు.ఆ ఇంటి పెద్ద చాలాసేపు మాట్లాడి వారిద్దరి మధ్య రాజీ కుదిర్చాడు. ఇదంతా అయ్యేసరికి భోజనవేళయ్యింది. దాంతో ఇంటి పెద్ద ముల్లా దంపతులను తన ఇంట్లోనే తినమన్నాడు. అక్కడే భోంచేసారు. అనంతరం ముల్లా తన భార్యతో "రోజూ ఇలా నాతో గొడవపడుతూ ఉండు. ఎవరింట్లోకో చేరుకుందాం. అక్కడొకరు మన మధ్య రాజీ చేసి ఇలాంటి రుచికరమైన భోజనం పెడతారు" అని చెప్పాడు.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు