హైదరాబాద్ వాసులకు శుభవార్త..... అందుబాటులోకి ఉచిత క్యాబ్ సర్వీస్...!* --- వాహనాలు నిలిచిపోవడంతో ఏదైనా కారణం వల్ల ఆస్పత్రులకు వెళ్లే వాళ్లు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇలాంటి వారి కోసం *తెలంగాణ ప్రభుత్వం మహేంద్ర ఎలైట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంస్థకు అనుమతులు ఇచ్చింది.* నేటి నుంచి *నగరవాసులకు అత్యవసర సేవల కోసం ఉచిత క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.* *చిన్నారులు, గర్భతులు, వృద్ధులు అత్యవసర వైద్య సహాయం నిమిత్తం కాల్ చేసి ఉచిత క్యాబ్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.* సంస్థ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఏడు క్యాబ్ ల ద్వారా 24 గంటల పాటు ఉచిత సేవలు అందిస్తున్నట్లు ప్రకటన చేశారు. *నగర వాసులు క్యాబ్ సేవల కోసం 8433958158 నంబర్ కు కాల్ చేయాలని సంస్థ ప్రతినిధులు సూచించారు*. సీపీ అంజనీ కుమార్ ఉచిత సేవలు అందిస్తున్న సంస్థను అభినందించారు. నగవాసులు సంస్థ అందిస్తున్న క్యాబ్ సర్వీసులు వినియోగించుకోవాలని సూచించారు.


కామెంట్‌లు