ముల్లా కథలు - 25--ముందుచూపు-- ముల్లా ఓ పెళ్ళివారింటికి వెళ్ళాడు. తాను వేసుకొచ్చిన చెప్పులను వాకిట్లో విడిచిపెట్టక సంచీలో ఉంచి లోపలికి పట్టుకెళ్ళాడు. గదంతా హడావుడిగా ఉంది.ఓ మిత్రుడు ముల్లాను చూసి "సంచీలో ఏమిటి? కొత్త పుస్తకమా? ఎక్కడకొన్నారు? పుస్తకం పేరేమిటీ?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.వాటికి ముల్లా ఇలా జవాబిచ్చాడు...."అవును. పుస్తకమే. శీర్షిక ముందుచూపు. దీనిని వస్తూ వస్తూ చెప్పుల దుకాణంలో కొన్నాను" అని! - యామిజాల జగదీశ్


కామెంట్‌లు