సామాజిక బాధ్యతకు ప్రతిరూపం ఈ విశ్రాంత ఉపాధ్యాయుడు..-- ఒక అరటిపండు నలుగురు దానం చేసి నవ్వుతూ ఫొటోలు తీసుకునే ఈరోజుల్లో... నిజమైన సేవ అంటే ఏమిటో, హృదయంతరాలలోనుండి వచ్చే స్పందన ఎలావుంటుందో, కర్మయోగం అంటే ఏమిటో, తెలుసుకోవాలంటే... ఈ మహానుభావుడు చేసిన సహాయం గురించి తెలుసుకోవాలి మనమందరం.. చేసిన సహాయం చిన్నదా,పెద్దదా అనికాదు, మనస్ఫూర్తిగా సాయం చేయాలనుకుంటే, సాయంచెయ్యాలన్న దృఢసంకల్పం ఉంటే, ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు అని నిరూపించాడు ఈ విశ్రాంత ఉపాధ్యాయుడు.. 👉 #వివరాలలోకి వెళితే... కలకత్తా ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది డండం విమానాశ్రయం వెనుకవైపు వీధిలో గుండా లాక్ డౌన్ పరిస్థితులను గమనిస్తూ వాహనంలో వెళుతున్నారు. ఒక ఇంటి కిటికిలోనుండి వృద్దుడు ఒకరు చేయి ఊపి ఇటు రమ్మని పిలవడం వారు గమనించి ఆయన ఇంటివైపు వెళ్లారు.. బహుశా ఆయనకు ఆరోగ్యపరంగా కానీ ఆహారపరంగా కానీ ఏదైనా సహాయం అవసరమై పిలిచాడని పోలీస్ వారు భావించారు.. ఆ వృద్దుడి దగ్గరకు వెళ్ళాక ఆయన పోలీస్ వారితో అన్న మాటలు వారిని ఆశ్చర్యానికి,ఆనందానికి గురిచేశాయి. ఆయన అన్న మాటలు.. అయ్యా.... నాపేరు సుభాష్ చంద్ర బెనర్జీ..వయసు 82 సంవత్సరాలు. దీనబంధు విద్యాలయం లో ఉపాధ్యాయుడిగా పనిచేసి 1998 లో పదవీవిరమణ చేశాను. ఈ ఇంట్లో ఒంటరిగా నాకొచ్చే పెన్షన్ తో జీవిస్తున్నాను. ఇప్పటి పరిస్థితులు నన్ను కలచివేస్తున్నాయి..నాగురించి నాకు చింతలేదు..నా బాధ అంతా దేశం,సమాజం ఇప్పుడున్న పరిస్థితులలో నేను ఏమీ చేయలేకపోతున్నాననే వేదన కలచివేస్తోంది. శారీరకంగా బలహీనంగా ఉన్నందున నేను బయటికి వచ్చి ఎలాంటి సాయం చేయలేను..ప్రభుత్వానికి ఏదైనా నావంతుగా,బాధ్యత గల పౌరుడిగా సహాయం చేద్దామని ఉంది. కానీ ఎలా చేయాలో తెలీదు..నాకు ఆన్ లైన్ బ్యాంకింగ్ లాంటి వాటిమీద అవగాహన లేదు. అందుకే మీసహాయం కోరి పిలిచాను..అంటూ ముఖ్యమంత్రి సహాయనిధి పేరుమీద పదివేల రూపాయల చెక్ రాసి సంతకం చేసి పోలీస్ ఆఫీసర్ కు ఇచ్చి దీనిని సంబంధిత కార్యాలయానికి పంపే ఏర్పాటు చేయగలరు అంటూ మిమ్ములను ఇబ్బంది పెట్టివుంటే మన్నించండి అని వినమ్రతతో విన్నవించుకోవడమే కాకుండా... ఈ విపత్కర పరిస్థితులలో ప్రతిఒక్క పౌరుడు దేశానికి అండగా నిలబడాలని ఆకాంక్షించారు. ఆయన కోరిక మేరకు చెక్ తీసుకొని మీకు ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి ఇల్లు దాటి బయటికి రావద్దంటూ సలహా ఇచ్చి ఆ చెక్ ను సంబంధిత నిధికి పంపేలా చర్యలు తీసుకున్నారు పోలీస్ సిబ్బంది. ఈవయసులో.... ఆయన గురించి,ఆయన ఆరోగ్యం గురించి ఒకరిమీద ఆధారపడవలసిన పరిస్థితులలో .... దేశం గురించి, సమాజం గురించి, ఆయన పడుతున్న తపన, వేదన మనకందరికీ ఒక సందేశం లాంటిది. నాకోసం,నాకుటుంబం కోసం అంటూ కోట్లరూపాయల ఆస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్నాకూడా... ప్రభుత్వం యిచ్చే ఉచిత రేషన్ మరియు కాయగూరల కోసం క్రమం తప్పకుండా బాధ్యతగా వెళ్లి తెచ్చుకొనే ప్రతిఒక్కరం ఆలోచించాలి మనం చేసే పని కరెక్టేనా అని. Source... The Telegraph india... శ్రీధర్ రాజోలి..✍


కామెంట్‌లు