కనువిప్పు.(కథ)వ్యాసపురిలో నీ ఉన్నత పాఠశాలలో శేఖర్ తొమ్మిదవ తరగతి చదువు చున్నాడు. శేఖర్ తండ్రి రామయ్య ప్రభుత్వ ఉద్యోగి. వారి ఇంటికి ప్రతిరోజు ఆంధ్రప్రభ దినపత్రిక వచ్చేది. రామయ్య పత్రికను చదివి శేఖర్ కు చదువు మని ఇచ్చే వాడు. చదివిన తరువాత పేపర్లన్నీ భద్రపరచి ఉంచు మని చెప్పాడు. శేఖర్ తండ్రి చెప్పినట్లు పేపర్ చదివిన తరువాత భద్రపరచి ఉంచేవాడు. నెల పూర్తయిన తరువాత కిరాణా కొట్టు లో అమ్మి కావలసిన పెన్ను పెన్సిలు రబ్బరు నోటు పుస్తకాలు కొనుక్కునే వాడు. ఒకసారి శేఖర్ పేపర్ల మధ్య అట్టా ముక్కలు పెట్టి కొట్టు వానికి పేపర్లు అమ్మి నాడు. శేఖర్ మీద కొట్టు వానికి నమ్మకం కుదిరి నందున పేపర్లు తూకం వేసి కొన్నాడు. పేపర్ల డబ్బులకు సరిపడ వస్తువులు ఇచ్చాడు. రెండు రోజుల తరువాత సరుకులు కట్టటానికి కొట్టు వాడు పేపర్లు తీస్తుంటే వాటిలో అట్టముక్కలు కనిపించాయి. పిల్లవాడు మోసం చేశాడని కొట్టు వాడు గ్రహించాడు. కొట్టు వాడు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని అందులోని బిస్కెట్స్ అన్ని తీసివేసి చక్కగా అట్టముక్కలు కత్తిరించి ప్యాకెట్ లో అమర్చాడు. ప్యాకెట్ ఎప్పటి లాగా తయారుచేసి ఉంచాడు. శేఖర్ బిస్కెట్ ప్యాకెట్ కోసం వస్తే ఇద్దామని అనుకున్నాడు. ఒకరోజు శేఖర్ బిస్కెట్లు కొనటానికి కొట్టుకు వచ్చాడు. అయిదు రూపాయలు ఇచ్చి బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. ఇంటికి వెళ్లి తినటానికి ప్యాకెట్ విప్పాడు. ప్యాకెట్ లో అన్ని అట్ట ముక్కలు వెళ్లినాయి. శేఖర్ తిరిగి కొట్టుకు వచ్చి ప్యాకెట్ లో అన్ని అట్టముక్కలుయని చూపించాడు. తనకేమీ తెలియదన కొట్టు వాడు చెప్పాడు. అంకుల్ నిజమే చెప్తున్నాను ఇందులో అట్టముక్కలు ఉన్నాయని అన్నాడు శేఖర్. నీవు నిజమే చెప్తావా? అబద్ధం చెప్పవా? అని ప్రశ్నించాడు కొట్టు వాడు. అయితే నిజం చెప్పు మొన్న నీవు అమ్మిన రద్దీ పేపర్లలో అట్టముక్కలు పెట్టినావా? లేదా? అని కొట్టు వాడు శేఖర్ ను అడిగినాడు. శేఖర్ తల దించుకున్నాడు. శేఖర్ కు కనువిప్పు కలిగింది. తప్పు చేశానని ఒప్పుకున్నాడు. చేసిన తప్పు ఒప్పకున్నందుకు కొట్టు వాడు శేఖర్ ను మన్నించి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పంపినాడు. ఆనాటినుండి శేఖర్ మళ్లీ ఎప్పుడు తప్పు చేయకుండా ఉన్నాడు. ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్ 9441333315


కామెంట్‌లు