ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్బంగా పదేళ్ళ కిందటి నాకు నచ్చిన,మరెందరో మెచ్చిన నా నెమలీకలు లోని కొన్ని నానీలు.. శుభాకాంక్షలతో.. .................................... తొక్కుడు బండకున్నంత ఓపికట తొక్కడం రానందు వల్లే కదా! దేన్ని సాధించింది ఆత్మహత్య మరణవాంగ్మూలం లోనన్నా ప్రతీకారం లేదే.. రాజూ బంటూ మంత్రీ నువ్వే ఇంట్లో సవ్యసాచివి చివరకు కరివేపాకువి పద్మిని హస్తినీ చిత్తిని మరి పద్ముడు హస్తుడు చిత్తుడూ లేరెందుకూ అతనిదీ ముందుచూపే సక్కుబాయి సావిత్రి సుమతీలను సృష్టించాడు హక్కులు నువ్విచ్చేదేమిటి ఆవేమన్నా కనబడే వస్తువులా అదేమిటి అన్నందుకు ఝాన్సీనట అదెందుకు అంటే హేతువాదినట 'చేతులకు గాజులేసుకున్నామా.!' దమ్ముంటే స్తన్యమిచ్చి పెంచమనండి ఏనుగుని దారంతో కట్టేశారు తెంపుకోలేదేమి? కట్టుబాటు. లెక్కకు రాదెందుకు ఆడదాని రెక్కల కష్టం ఎక్కడైనా పక్కనేసుడే--.నాంపల్లి సుజాత


కామెంట్‌లు