రావణుని వివాహం.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్. పులస్యుని కుమారుడువిశ్రవసుడు ఇతనికుమారుడు రావణుడు తనపట్టాభిషేకం అనంతరం రావణుడు తనచెల్లెలు శూర్పణఖను కాలకరాక్షసుడికుమారుడు విద్యుజ్జిహ్వుడితో పెళ్లిజరిపించాడు. అనంతరంకొద్దిరోజులకు తనపుష్పకవిమానం లో విహరిస్తున్నా సమయంలో అరణ్యంలో ఒక దైత్యుడు అందాలరాశి అయినఓ యువతితో చూసి అతనిచేరువగా వెళ్లి"ఈఅరణ్యంలో ఎందుకు మీరుఉన్నారు అని అడిగాడు"అప్పుడు ఆదైత్యుడు "నేను దితి పుత్రుడిని పేరు మయుడు అంటారు.అప్సరసఅయిన హేమ నాభార్య,నాకు ఇద్దరుకుమారులు పెద్దవాడు మాయావి,రెండవవాడు దుంధుభి. ఈమెనాకుమార్తే మండోదరి వనవిహారంలోఇలావచ్చాం"అన్నాడు "అయ్యనేను విశ్రవశుమహర్షి పుత్రుడిని లంకాధిపతిని మీకు సమ్మతమైతే ఇప్పుడే అగ్నిసాక్షిగా వివాహంచేసుకుంటాను" అన్నాడు.మయుడు సమ్మతించి వారివివాహంజరిపించాడు. వెంటనేలంకానగరం చేరిన రావణుడు వైరోచనుడు మనుమరాలు వజ్రజ్వాలను తనతమ్ముడైన కుంభకర్ణునికి,శైలూషుడుఅనే గంధర్వుడికుమార్తే సరమను మరోతమ్ముడుఅయిన విభీషణుడికి ఇచ్చి వివాహంజరిపించాడు.ఇక్ష్వాకువంశ రాజు అనరణ్యుడిని రావణుడు యుద్దంలో జయించగా చనిపోతూ "మావంశంలో జన్మించిన వాడిచేతిలో నీకు మరంతప్పదు అనిశపించాడు అనరణ్యుడు.ఆశాపఫలంగా ఇక్ష్వాకవంశంలో జన్మించిన శ్రీరాముని చేతిలో రావణుడు మరణించాడు.


కామెంట్‌లు