అన్నయ్య!!ఈ పిలుపు ఎప్పుడు "ఎదురుచూపు"తో కూడుకుకున్న బంధమే నాకు. అమ్మ నాన్నలకు ఇద్దరం సంతానం, అన్నయ్య, నేను.అమ్మానాన్నల రక్తాన్ని, అమ్మపాల కమ్మదనాన్ని పంచుకున్న మా ఇద్దరికీ,అల్లరిని ఆటపాటలను పంచుకున్న జ్ఞాపకమైతే లేదు, ముందు చెప్పినట్టుగాఅన్నయ్య అంటే చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఎదురుచూపే..చిన్నప్పుడు చదువుపరంగా హైదరాబాద్ లో, ఇప్పుడు వృత్తిపరంగాఅమెరికాలో. అన్నయ్య వస్తున్నాడంటే గుండె నిండిన సంతోషం ఉబికి కళ్ళలో నీరుగా జారేది, వెళ్లిపోతున్నా.. కన్నీటితో మసకబారిన ఆ చూపులు వీధిచివర వరకు చూస్తూనే ఉండిపోయేవి అమ్మ లోపలికి తీసికెళ్ళేవరకు.. సెలవులకు అన్నయ్య ఇంటికి వచ్చి రాగానే బ్యాగ్ లో వస్తువులు బట్టలు ఒకొక్కటిగా తీస్తూవుంటే.., నా చూపులు మాత్రం నాకోసం తెచ్చే చెప్పులు గాజుల కోసం వెతుకుతువుండేవి, అప్పటివరకు కాళ్లకు చెప్పులు లేకుండానే మండుటెండలో ఆటపాటలకు తిరిగిన నా కాళ్ళు అన్నయ్య తెచ్చిన చెప్పులను తొడిగి వీధి వీధి తిరుగుతూ ఇంటి ఇంటికి చూపించుకోచేదాన్ని..ఇక చదువు విషయానికి వస్తే వాడు ఎప్పుడు చదువుల్లో టాపర్, నేను ఎప్పుడు backbencher నే, స్కూల్ లో టీచర్ ని మినహాయిస్తే, మా అమ్మ తరువాత మా అన్నయ్యనే చేతివాటానికి, ఎన్ని చెంపదెబ్బలో..ఇప్పటికీ జ్ఞాపకమే, నేను కూడా బాగా చదువుకొని ఇండిపెండెంట్ గా ఉండాలని తన కోరిక, అమ్మానాన్నలతో ఇప్పటికీ వాదిస్తాడు తనతో పాటుగా హైదరాబాద్ లో ఉంచి చదివించలేదని, నేను డిగ్రీ తో చదువు ఆపేస్తానన్నప్పుడు నా మీద అరిచాడు కూడా, వాడికి ప్రేమను వ్యక్తపరచడం రాదు, కాని గుండె నిండా ప్రేమే..ఈ రోజు అన్నయ్య పుట్టినరోజు, లాస్ట్ ఇయర్ ఇండియా కి వచ్చి వెళ్ళాడు , one year అయింది వాడిని చూసి, మళ్ళీ వచ్చే వరకు ఎదురుచూపే--Happy bday pavva--స్వప్న చార్వక్


కామెంట్‌లు