అంశుమంతుడు.(పురాణపాత్ర)డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.సూర్యుడు,వైవస్వతుడు,ఇక్షాకుడు,వికుక్షి,పురంజయుడు,యోవనాశ్వుడు,మాంధాత,పురుకుత్సుడు,త్రనదస్యుడు,అరణ్యుడు,త్రిశంకుడు, హరిశ్చంద్రుడు,బాహుకుడు,సగరుడు,అసంమంజసుడు.సగరుని మనుమడు.అసమంజసునిపుత్రుడు.పలువురు సగరుని పుత్రులు యాగాశ్వాన్ని వెదుకుతూవెళ్ళిమరణిస్తారు.వారినివెదుకుతూ వెళ్లిన అంశుమంతునికి కపిలమహర్షి ఆశ్రమంలో అశ్వకనిపిస్తుంది .సగరుని పుత్రులంతా అక్కడ భస్మరాసులుగాకనిపిస్తారుఅంశుమంతుడు కపిలమహర్షినిప్రారర్ధించగా,అశ్వాన్నితీసుకుపోమ్మన్నాడు.తమపూర్వికులకు స్వర్గ ప్రాప్తి కలిగేమార్గంచెప్పమని వేడుకోగా నీమనుమడు అయిన భగీరధుని వలన గంగ భూమిపైకివస్తుందని అప్పుడు వారందరికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని కపిలమహర్షి చెపుతాడు.యాగాశ్వాన్ని తెచ్చిసగరునకు ఇస్తాడు.యాగానంతరం సగరుడు అంశుమంతునికి పట్టాభిషేకం చేసి, తపస్సుకు వెళతాడు.అనంతరం అతనిపుత్రుడు దిలీపునకు పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకుంటూ తనువు చాలించాడు అంశుమంతుని మనుమడు దిలీపుని కుమారుడు భగీరధుడు దివిజగంగను భువికి తెచ్చి తనవారందరికి స్వర్గ ప్రాప్తకలిగించాడు.


కామెంట్‌లు