బాల సాహిత్యం- అవలోకనం--ఈనాడు మన జాతీయ అవలక్షణాలో సామాజిక బాధ్యతలకు దూరంగా బ్రతకడం ఒకటి. పట్టించు కోవలసిన విషయాలు, అనేకం ఉన్నా పట్టించుకోక పోవడం ఒక ఎత్తయితే పిల్లలను పట్టించుకోకుండా ఉండడం మరొక ఎత్తు. పిల్లలను పట్టించుకోకపోవడం వల్ల జాతి భవిష్యత్తు నాశనం అవుతుంది. తన కన్న పిల్లలను పట్టించుకోకపోవడం ఉంటుందా? ఏమిటి ఉద్బోధలు అనే ప్రశ్న వేసేవారు ఉండవచ్చును. కానీ మన జాతి పౌరుల యోగక్షేమాల గురించి, ఎంతవరకు పట్టించుకుంటున్నామో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవలసిన అవసరం ఉంది.1. పూర్వం వలె అమ్మమ్మలు, నాన్న మ్మలు తాతయ్య లు పిల్లలతో మాట్లాడుతున్నారా! కథలు చెబుతున్నారా! దీనికి సమాధానం..2.మనం ఇంట్లో పిల్లల బాగోగులను పట్టించుకోవడానికి గాని లేదా ఆలోచించడానికి గానీ తల్లిదండ్రులకు సమయం ఉందా3. పిల్లలకు బడిలో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. కానీ కథలు చెప్పడం గానీ కథల పుస్తకాలు చదివించడం గానీ జరుగుతున్నాయా? (ఇది అన్ని చోట్ల అని కాదు).4. మాన సాహిత్య పుస్తకాలు , అలాగే పత్రికలలోని బాలల శీర్షికలు పిల్లలకు చదివించే పద్ధతిలో ఉన్నాయా?4. బాలల గ్రంధాలు వారి చేతికి ఇచ్చి బడిలో గాని ఇంట్లో గాని చదివించే పరిస్థితులు ఉన్నాయా? మనం ఇలా ఆలోచించు కుంటే కొన్ని చోట్ల విరుద్ధమైన జవాబులు వస్తాయి. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. కేవలం ఉపాధ్యాయులనే తప్పు పట్లలేం, సవా కారణా లుంటాయి. అసలు పిల్లలను సమాజమే మరిచి పోతుందేమో అనిపిస్తుంది. నేటి మన తెలుగు భాషలో చాలా మేరకు బాల సాహిత్యం ఉత్పత్తి అవుతుంది, ఇంకా అవుతూనే ఉంది. నాటి రచయితలు కొన్ని మార్గదర్శకాలు చూపారు,వారి అడుగుజాడల్లో నడిచిన రచయితలు ఉన్నారు. నిజాయతీగల రచయితలు కొండంత అండగా కృషి చేస్తున్నారు. మరికొన్ని పుస్తకాలు వ్యాపార దృష్టి లో బాలసాహిత్యాన్ని కలుషితం చేస్తున్నాయి. అయితే నేటి బానే సాహిత్యకారులు కలుషితమైన బాలసాహిత్యాన్ని శక్తివంచన లేకుండా నిర్వహిస్తున్నారు. బాల సాహిత్యం రాసేవారు ముందుగా బాలల మనస్తత్వం తెలిసి కోవడం మంచిది. అందుకు ఉదాహరణగా ఈ కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో లో ఇరుగు పొరుగున ఇద్దరు పిల్లలుఉండేవారు. వాళ్లు కలసిమెలసి ఆడుకునేవారు చదువుకునే వారు. ప్రతి విషయంలో పోటీ పడేవారు.వాళ్లు పెద్ద చదువులు చదివి, మంచి ఉద్యోగాలు సంపాదించారు. ఒకడు అమెరికాలో మరొకడు, జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడు, సంక్రాంతి పండుగకు వాళ్లు సొంత ఊరిలో కలుసుకున్నారు.ఒక మిత్రుడు ఫోటో ఇమ్మని అడిగాడు. సరే తర్వాత పంపిస్తాను అన్నాడు. ఆయన తన ఫోటో కి బదులుగా బాల్యంలోని వారిద్దరి ఫోటో పంపాడు. మిత్రుడుచేరిన ఫోటోను చూసి ఇదేమిటి అని ప్రశ్నించాడు. ఇదే ! మన బాల్యంలో కల్లాకపటం లేకుండా తిరిగేవాళ్ళం. అరమరికల్లేకుండా మాట్లాడుకునేవాళ్ళం. కొట్టుకున్న తిట్టుకున్న వెంటనే కలిసి పోయే వాళ్ళం. మనసులో లో చాలాసేపు తగలడానికి చాలా సేపు తగిలారు లో ఎటువంటి కలుషితం లేకుండా ఉండేవాళ్ళం.ఒకరికొకరు ఇచ్చి పుచ్చు కోవడంమే కాక పరులకు కొంత ఇచ్చేవాళ్ళం. అవసరమైన సాయం చేసే వాళ్ళం.కానీ ఇప్పుడు మనం ప్రతీ పనీ స్వార్థంతో చేస్తూన్నాం. పరుల సాయం మాట మరిచిపోయాం. అందుకే కల్లాకపటం ఎరుగని ఫోటోనుపంపించాను.మరొక చిన్న కథ ఇది మనకు తెలిసిందే..! ఇరుగు పొరుగున ఇద్దరు పిల్లలు ఉండేవారు. వాళ్లెప్పుడూ ఆటపాటలలో గడిపేవారు. ఒక రోజునఆటలో కొట్టుకుని గాలి చంపుతున్నారు చొక్కాలు చింపుకొని ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు చూసి తమతమ పిల్లల్ని వెనకేసుకొని చాలాసేపు తగవులాగడం జరిగింది. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయనకు తగవుఅంతా చెప్పి, తీర్పు ఇవ్వమన్నారు. అతడు ఇద్దరు పిల్లలు ఉన్న చోటుకు తీసుకువెళ్లి చూపించాడు. వాళ్ళిద్దరు హాయిగా ఆడుకుంటున్నారు. ఇక తెల్లమొహం వేయడం తల్లిదండ్రుల వంతు అయింది. అప్పుడు పెద్ద మనిషి చెప్పాడు. పిల్లల తగవులు మనం పట్టించుకో కూడదు. అప్పుడే తగువులు అప్పుడే ఆడుకుంటారు, కలసు కుంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు అని చెప్పి పెద్దమనిషి వెళ్ళిపోయాడు. ఇవి బాలల మనస్తత్వానికి ఒక ఉదాహరణ.బాల సాహిత్య కారులు బాలల మనసులు దృష్టిలో ఉంచుకొని రచనల సాగించాలి. ఎక్కడికి వెళ్ళినా పిల్లల గమనిస్తూ వారి పోకడలు మనస్తత్వాన్ని ఎల్లప్పుడూ పరిశోధించాలి. అలా అయితేనేపిల్లల కోసం రాసిన విషయాలు సహజంగా ఉంటాయి. శాశ్వతత్వం ఉంటుంది. ( రేపు మరి కొంత) -బెహరా ఉమామహేశ్వరరావు పార్వతీపురం సెల్ నెంబర్:9290061336
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. . **** . *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
• T. VEDANTA SURY
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
• T. VEDANTA SURY
భళిరే నైరా
• T. VEDANTA SURY
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి.
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి