ఉదర సమస్యలు - జొన్న పేలాలు : ఆహారం జీర్ణం కాకుండా అప్పుడప్పుడు మనకు ఉదర సమస్యలు ఉత్పన్నమవుతాయి అలాంటప్పుడు మనకు జొన్న పేలాలు ఉపకరిస్తాయి. కొన్ని తెల్ల జొన్నలను తెచ్చి మూకుడులో వేసి వేడి చేస్తే కొద్దీ సేపటిలో అవి పేలాలుగా తయారవుతాయి. కొన్ని జొన్న పేలాలను తీసి ఒక గిన్నెలో నీరు పోసి అందులో కరివేపాకు ఆకులను తీసివేసి ఈనెలను నలగ్గొట్టి వేసి కొద్దిగా జిలకర ఉప్పు వేసి మరిగించితే కాషాయం తయారవుతుంది. గోరు వెచ్చగా వున్నప్పుడు ఆ కాషాయం తాగాలి. ఆహరం పై విముఖత తగ్గి అజీర్తి తగ్గి వాంతులు కాకుండా కాపాడుతుంది. కొద్దీ సేపట్లో ఆకలి పుడుతుది. అనేక ఉదర సమస్యలు రాకుండా కాపాడుతుంది. శరీరానికి బలాన్నిస్తుంది. -పి . కమలాకర్ రావు


కామెంట్‌లు