హాయ్ ఫ్రెండ్స్... అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న తెలంగాణ సాహితి, ప్రేరణ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 'లాక్ డౌన్' నేపథ్యంలో కవితా పోటీలు నిర్వహించాలని నిశ్చయించాం. తొలుత గ్రేటర్ హైదరాబాద్ వరకే నిర్వహించాలని అనుకున్నప్పటికీ ఔత్సాహికుల నుంచి విశేష స్పందన లభించింది. మధ్యాహ్నం పోస్ట్ పెడుతున్నంతసేపటిలోనే తమకూ అవకాశం కల్పించాలని వివిధ జిల్లాల నుంచి ఎంతోమంది మితృల నుంచి సూచనలు వెల్లువెత్తాయి. దీనితో హైదరాబాద్ వరకే అనే నిబంధనను సడలించాము. అందరూ గమనించవలసిందిగా మనవి. - నస్రీన్ ఖాన్ ఉపాధ్యక్షులు, తెలంగాణ సాహితి


కామెంట్‌లు