పిల్లల నుంచి వృద్ధుల వరకు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు. వార్డ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు. ఇండియా నుంచి ప్రపంచం నలుమూలలకు. అంతా ఒకటే మంత్రం. యోగా. మానసిక సమస్యలకు పరిష్కార మార్గం యోగా. శారీరక రుగ్మతలకు సొల్యూషన్ యోగా. ఆధ్మాత్మికానుభూతికి ఆలవాలం యోగా.ఒకప్పుడు.. భారత్ నుంచి అడుగులు ప్రారంభించి.. ఇప్పుడు దశదిశలా వ్యాపించిన యోగాని.. మళ్లీ ఇండియానే బ్రాండింగ్ చేయడం.. ఈ యోగాడే స్పెషల్. మారుతున్న పరిస్థితులకు తగినట్టు మానసిక, శారీరక ఒత్తిడిన జయించలేక సతమతమవుతోంది ప్రపంచం. ఈ నేపథ్యం లో యు ఎన్ ఓ జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా.. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది.ఈ సందర్బంగా అందరికి శుభాకాంక్షలు. యోగ చేయండి ఆరోగ్యంగా వుండండి - తిరువరంగం ప్రహ్లాద్ , పాలెం. నాగర్ కర్నూల్ జిల్లా.


కామెంట్‌లు