*రాగగీతి ప్రక్రియ*లో *రాగమణి*బిరుదుకు కవులు ఎంపిక-- ఆంద్రప్రదేశ్ చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన ప్రముఖ రచయిత్రి ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపకురాలు ధనాశి ఉషారాణి చందస్సుతో కూడుకున్న రాగగీతి అనే పద్యప్రక్రియను నూతనంగా రూపొందించారు.ఇందులో 4 పాదాలు ఉంటాయి , 5 గణాలు ఉండేలా చివరిలో రమ్యమైనది చూడు రాగ గీతికను అనే మకుటము వచ్చేలా ప్రతి పాదములో సూర్య ఇంద్ర సూర్య ఇంద్ర సూర్య గణము వచ్చేలా రాస్తూమొదటి మరియు నాలుగో పదముకు యతిప్రాస వచ్చేలాగున రూపొందించారు.ప్రారంభించిన కొద్ది రోజులకే కవులు 1000 రాగగీతిక పద్యములను కవులు నియమాలను బట్టి రాశారు వచన కవిత్వం ప్రాధాన్యత పొంది ఛందస్సు మరిచిపోతున్న తరుణంలో కవులు ఆదరిస్తున్న రాగ గీతికలోశతకము రాసిన వారికి *రాగమణి* బిరుదుకు కవులను ఎంపిక చేసి సత్కరించనున్నారని రాగగీతి రూపకర్త ధనాశి ఉషారాణితెలియజేసారు *రాగగీతి పద్యము* *కవన సేవను చేయు కవులకు భవిత దిద్దు భాగ్యము పొంది ధీరులు గాను నిలిచి వెలుగును నిలుపు నిత్యము భువిన రమ్య మైనది చూడు రాగ గీతికను *రాగశ్రీబిరుదు పొందిన మొదలగు కవులు రాగమణి బిరుదును పొందారు. 1)చౌకి రాజేంద్ర 2)అయ్యవారు మురళి3)చేవెoడ్ర శ్రీనివాస్ రావు4)మామిడి రమేష్5)జామి సత్యనారాయణ 6)శేషo వేణుగోపాల్ శర్మ కవులు రాగమణి బిరుదుకు ఎంపిక అయ్యారు అని తెలియజేసారు రూపకర్త ధనాశి ఉషారాణి. గౌ.అధ్యక్షులు ఆచార్య తప్పెట రామ ప్రసాద్ రెడ్డి.గౌ.సలహాదారులు నారాయణస్వామి సాహితీ వేత్తలు అభినందనలు తెలియజేశారు


కామెంట్‌లు