వృక్షం సాక్షాత్ పరబ్రహ్మం : --సోషల్ వర్కర్--ప్రతినిధి వెంకట్--పెడ్డేముల్:---వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మంబాపూర్ గ్రామం లోని మాంబాచెరువు కట్ట పై హరితహారం ప్రోగ్రాం లో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జాతీయ అవార్డు గ్రహీత (సోషల్ వర్కర్) మొలక ప్రతినిధి వెంకట్ మొక్కలు నాటి మాట్లాడుతూ వృక్షాలు దైవంతో సమానం కాబట్టి మొదట దేవునికి పండ్లు పుష్పాలు కొబ్బరికాయ ఇవన్నీ కూడా దేవునికి సమర్పించాలి అంటే మొదటగా మొక్కలను దర్శించాలి చెట్లను నిర్లక్ష్యం చేయరాదని బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సంరక్షించాలి అన్నారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య స్ఫూర్తితో గత ఆరు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం 50 నుంచి 100 మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం కృషి చేస్తానని అలాగే విద్యార్థులకు హరితహారం పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను బాధ్యతగా తీసుకొని మొక్కలను రక్షించి ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ముద్దిని రాములు బోయిని నారాయణ సంగెం వెంకటయ్య తలారి బాల య్యా ముద్ది నీ వీరప్పమధు తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు