నోటిలో పుండ్లు , కడుపులో పుండ్లు - నివారణ - నోటిలో పుళ్ళు ఎక్కువగా పోషకాహార లోపం వలన వస్తాయి. ఎక్కువగా మాత్రలు మింగే వారికి వస్తాయి. నూనె పదార్థాలు తిన్నా వస్తాయి. కొన్ని బాదాం పప్పులు నాన పెట్టి పై పొత్తు తీసి మెత్తగా నూరాలి మరిగించిన పాలలో నీరు ఎక్కువగా కలిపి బాదాం ముద్దను వేసి తాటి కలకండ లేదా బెల్లం వేసి తాగాలి. నోటిలో పుళ్ళు తగ్గి పోతాయి. ధనియాలు +జిలకర + సోంపు కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకుని తాజా వెన్న ముద్ద లో కలిపి తిని గోరు వెచ్చని నీరు తాగాలి. పుళ్ళు తగ్గి పోతాయి. దీనితో అతిమధురం పొడి కాషాయం చేసి తాగితే నోటిలో ఫుల్లు , కడుపులో పుళ్ళు తగ్గి పోతాయి. కొద్దిగా పులుపు, కారం తగ్గించాలి. - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు