2డి ఈకో;--గుండె నిర్మాణంలో, నిర్వహణలో ఏమైనా సమస్యలు వుంటే 2డి ఈకో ను అల్ట్రా సౌండ్ స్కానింగ్ తరహాలో చేస్తారు.2డి ఈకో లో కొట్టుకుంటున్న గుండెను చూడవచ్చు, మరియు గుండెలోని గదులను,రక్త నాళాలను,వాల్వ్ లను కూడా చూడొచ్చు.దీనిని ఈకోకార్డియోగ్రామ్ అంటారు.దీనిలో గుండె పనితీరును గుర్తించవచ్చు.గుండె సైజు, నిర్మాణం, గుండె లోని ఇతర భాగాలను చూడవచ్చు.కలర్ డాప్లర్ ద్వారా గుండెలో ప్రవహిస్తున్న రక్త ప్రసరణ ను కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇంకా పుట్టని పిల్లల్లో గుండెకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవటానికి ఈకో కార్డియో గ్రామ్ ఎంతో ఉపయోగపడుతుంది.నొప్పి వుండదు.కాన్ ట్రాస్ట్ ఇచ్చి ఈకో కార్డియో గ్రామ్ చేస్తే కొందరికి ప్రాబ్లం వుంటుంది.మామూలుగాఈకో చేయడానికి 20 నిముషాల నుంచి ఒక గంట సమయం పడుతుంది.అయిదునిమిషాలు పేషెంట్ ను ఈకో సిద్ధం చేయడానికి పడుతుంది. మిగితాది రేపు......,........ ప్రమోద్ ఆవంచ


కామెంట్‌లు