ఎత్తరా మనజండా- రామ్మోహన్ రావు తుమ్మూరి - ఎత్తరా మన జండా. ఎలుగెత్తిన గుండెలతో ఎగిరెయ్ గగనం నిండా చిగురించిన ఆశలతో సత్యాహింసలు సహనం మన దేశపు ఎజెండా ఎలుగెత్తిన గుండెలతో ఎత్తరా మన జండా. /ఎత్తరా/ ధర్మభూమి కర్మభూమి పుణ్యభూమి మనదేశం సకల జనావళి సౌఖ్యమె మన దేశపు సందేశం /ఎత్తరా/ భిన్నతలో ఏకత్వం సాధించుట మనలక్ష్యం జగము నిండ జ్ఞానకాంతి ప్రసరించుట మన ధ్యేయం /ఎత్తరా/ ప్రగతిశీల ప్రజ్ఞానం మన దేశపు సౌభాగ్యం పలు మతాల సంస్కృతులకు ఆలవాలమీ దేశం /ఎత్తరా/ ప్రకృతితో అనుగమనం మన దేశపు ఆచారం పరుల కొరకు దేహముంది అన్నది మన సంస్కారం /ఎత్తరా/ పలుజాతుల పూలతోట దేశం బృందావనం మనసులన్ని పరిమళిస్తె మనదే నందనవనం /ఎత్తరా/ సుజల సుఫల సస్యామల సకల జనుల హృదయభరిత జయజయహో భాగ్యచరిత జయజయహో భరతమాత /ఎత్తరా/ స్వాతంత్ర్య దినోత్సవ సద్యస్ఫూర్తితో జండావందనానికి ముందుగా


కామెంట్‌లు